Begin typing your search above and press return to search.

ఇదేం పని అజయ్

By:  Tupaki Desk   |   16 March 2018 11:13 AM GMT
ఇదేం పని అజయ్
X
కొన్నిసార్లు మనం చేసే సరదా పనులు మన పీకల మీదకు తెస్తాయి. వాటి ఫలితం ఊహించే అవకాశం ఉండకపోవడం వల్ల నష్టం జరిగాకే ఇలా చేయకూడదు అనే సంగతి తెలుస్తుంది. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ఇది అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాడు. ఈ రోజు విడుదలైన రైడ్ మూవీ ద్వారా బాక్స్ ఆఫీస్ దగ్గర డివైడ్ టాక్ తెచ్చుకున్న అజయ్ దీని ప్రమోషన్ లో భాగంగా చెప్పిన ఒక ఇన్సిడెంట్ షాక్ కలిగించేలా ఉంది. అది తనే స్వయంగా షేర్ చేసుకున్నాడు. తనతో పాటు సినిమాలో నటిస్తున్న ఒక కో ఆర్టిస్ట్ పెళ్లి రైడ్ షూటింగ్ జరుగుతుండగానే అయ్యింది. కొత్త కాపురం కాబట్టి సదరు ఆర్టిస్ట్ తన భార్యను సెట్స్ కు తీసుకువచ్చేవాడు. తనకు అతనితో ఉన్న చనువు వల్ల అజయ్ దేవగన్ ఆ అమ్మాయితో క్లోజ్ గా మాట్లాడ్డం మొదలుపెట్టాడు. సరదాగా తనను టీజ్ చేద్దామని ఆవిడ భర్తకు వేరే అమ్మాయితో ఎఫైర్ ఉందని చెప్పడం మొదలు పెట్టాడట.

సరదాగా చేస్తున్నాను కనక ఇది ఎంత దూరం వెళ్తుందో చూద్దామని అజయ్ దేవగన్ ఈ తతంగం వారం పైగానే నడిపించాడు. రోజు ఆ అమ్మాయి రావడం భర్త ఇల్లీగల్ ఎఫైర్ అంటూ అజయ్ నూరిపోయటం డైలీ రొటీన్ గా మారిపోయింది. అంత పెద్ద స్టార్ హీరో పదే పదే చెబుతున్నాడు అంటే నిజమే అయ్యుంటుంది అని నమ్మిన సదరు ఆర్టిస్ట్ భార్య తర్వాత భర్తతో గొడవ పడటం చివరికి అది ముదిరి నిద్ర మాత్రలు మింగి సూసైడ్ దాకా వెళ్లి కథ ఆసుపత్రి దాకా చేరటం చకచక జరిగిపోయాయి. ఇది విన్న అజయ్ దేవగన్ కు నోట మాట రాలేదు. వెంటనే జరిగింది జంటకు వివరించి సరదాగా అన్నవి సీరియస్ గా ఎలా తీసుకుంటారు అని సర్ది చెప్పాడట.

అయినా పెద్ద మనిషివి అయ్యుండి ఇదేం పని అజయ్ అంటూ కొందరు కామెంట్స్ చేయగా ఫాన్స్ మాత్రం ఏదో కో ఆర్టిస్ట్ కొత్త పెళ్లి కొడుకు కదా సరదాగా ఆటపట్టిద్దాం అనుకుని ఉంటాడు, ఆ అమ్మాయి అంత సున్నితంగా ఆలోచిస్తుందని ఎవరికి తెలుసని వెనకేసుకొస్తున్నారు. మొత్తానికి అజయ్ దేవగన్ సరదాగా చేసిన కావాలని చేసినా ఇలాంటి టాపిక్ తో టీజ్ చేయటం మాత్రం సమర్ధనీయం కాదు.