Begin typing your search above and press return to search.
జక్కన్న సినిమాలో గెస్ట్ రోల్.. పైసా తీసుకోలేదట
By: Tupaki Desk | 8 Feb 2020 4:30 PM GMTబాహుబలి తర్వాత దర్శకుడు రాజమౌళి క్రేజ్ ఎంతలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా మీద టాలీవుడ్ కు మాత్రమే కాదు.. బాలీవుడ్ మొదలుకొని అన్ని వుడ్ లు ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. దీనికి తగ్గట్లే ఆయన తాజా మూవీ #RRR అదిరి పోయే కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తన సినిమాలో ప్రతి సన్నివేశాన్ని శిల్పం చెక్కినట్లు చెక్కే జక్కన్న.. తాజా చిత్రం లో మరింత జాగ్రత్త గా ఉన్నాడట.
బహుబలి తర్వాత వస్తున్న సినిమా కావటం.. చిన్న ఎన్టీఆర్.. రాంచరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్.. అలియా భట్ తో పాటు భారీ స్టార్ కాస్ట్ నటిస్తోంది. ఈ సినిమాలో అతిధి పాత్ర కోసం బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ చిన్న రోల్ చేశాడు. దీనికి సంబంధించిన షూటింగ్ ను ఇటీవల వికారాబాద్ అడవుల్లో చేసినట్లు తెలుస్తోంది.
అజయ్ షూటింగ్ అయ్యాక.. ఆయనకు పారితోషికంగా చిత్ర నిర్మాత కొంత మొత్తాన్ని ఆఫర్ చేయగా.. ఆయన సున్నితంగా రిజెక్టు చేయటం ఆసక్తికరంగా మారింది. రాజమౌళితో స్నేహం కారణంగానే ఈ సినిమాలో నటించానే తప్పించి.. మరింకేమీ లేదని చెబుతూ జక్కన్న కోసం ఫ్రీగా చేసినట్లు చెప్పారట. బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉన్న ప్రముఖ హీరో.. జక్కన్న అడిగినంతనే చిన్న పాత్రకు ఓకే చెప్పటమే కాదు.. చివరకు పైసా తీసుకోకుండా పని చేయటం చిత్ర పరిశ్రమ లో హాట్ టాపిక్ గా మారింది.