Begin typing your search above and press return to search.
యాక్షన్ గణ్ నే ఆడుకుందా?
By: Tupaki Desk | 19 April 2019 4:09 AM GMTబాలీవుడ్ యాక్షన్ హీరోల్లో అజయ్ దేవగన్ కి ఉన్న ట్రాక్ రికార్డు అసాధారణమైనది. భారీ యాక్షన్ చిత్రాలు.. కాప్ డ్రామాలకు పెట్టింది పేరు. ఇటీవల వరుస విజయాలతో దేవగణ్ స్పీడ్ మీదున్నాడు. ఇక ఇదే హుషారులో అతడు ప్రస్తుతం `దేదే ప్యార్ దే` అనే చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో దేవగణ్ స్నేహితురాలు టబు ఓ కీలక పాత్ర పోషిస్తుండగా.. అందాల రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా ఆడిపాడుతోంది. ఈ సినిమా ఎండింగులోనే మీటూ ఉద్యమం ప్రారంభమైంది.
ఈ ఉద్యమం దెబ్బకు దేవగణ్ చిత్రంపై పెద్ద పంచ్ పడింది. ఈ సినిమాలో నటిస్తున్న కీలక నటుడు అలోక్ నాథ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. నానా పటేకర్ పై తనూశ్రీ దత్తా ఆరోపణల అనంతరం బాలీవుడ్ లో వాతావరణం అకస్మాత్తుగా వేడెక్కిపోయింది. ఆ టైమ్ లోనే అలోక్ నాథ్ పై ఓ రచయిత్రి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. అటుపై అతడి తో `దేదే ప్యార్ దే` టీమ్ షూటింగుని కొనసాగించడాన్ని తనూశ్రీ తాజాగా తప్పు పట్టింది.
అలోక్ నాథ్ పై ఆరోపణలు వచ్చాక సినిమాలో కొనసాగించారు. అతడిని తొలగించకుండా ఎందుకు అలా చేయాల్సొచ్చింది? దీనిని బట్టి దేవగణ్ క్యారెక్టర్ ని ఏమని అర్థం చేసుకోవాలి? అంటూ తనూశ్రీ ప్రశ్నించింది. అయితే దీనికి అజయ్ దేవగణ్ సైతం అంతే ధీటుగా సమాధానం ఇచ్చారు. ``40 రోజుల పాటు అతడిపై సన్నివేశాల్ని చిత్రీకరించేశాం. ఆ సమయంలో అతడిని తొలగిస్తే బడ్జెట్ అమాంతం రెట్టింపవుతుంది. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. అయినా నేను ఆరోపణలు ఎదుర్కొన్న ఎవరికీ మద్ధతుగా నిలవలేదు`` అని వివరణ ఇచ్చాడు. ఒక్కడినే చేసి ఇలా ఆడుకుంటారా? అంటూ అసహనం వ్యక్తం చేశాడు దేవగణ్. అక్టోబర్ లో మీటూ ఉద్యమం మొదలైతే అంతకు ఒక నెల ముందే మా సినిమా చిత్రీకరణ పూర్తయిపోయింది. పెండింగ్ చిత్రీకరణలు అలోక్ నాథ్ పై చేయాల్సొచ్చింది. ఒకవేళ అతడిని తొలగించి వేరొకరితో ఆ సన్నివేశాల్ని చిత్రీకరించాలంటే ఆ నిర్ణయం నా ఒక్కడి వల్లా కాదని అజయ్ దేవగణ్ వివరణ ఇచ్చారు. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఆర్.ఆర్.ఆర్ లో దేవగణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.