Begin typing your search above and press return to search.

ఆర్ ఆర్ ఆర్ లో మూడో విప్లవ వీరుడు ?

By:  Tupaki Desk   |   16 March 2019 6:37 AM GMT
ఆర్ ఆర్ ఆర్ లో మూడో విప్లవ వీరుడు ?
X
ఆర్ ఆర్ ఆర్ ప్రెస్ మీట్ జరిగినప్పటి నుంచి దాని మీద జరుగుతున్న చర్చలు చెలరేగుతున్న ఊహగానాలు మాములుగా లేవు . మీడియా దీనికి సంబంధించి విస్తృత కవరేజ్ ఇచ్చింది. అలియా భట్ తోడవ్వడంతో బాలీవుడ్ సైతం ఇటు వైపు ఓ కన్నేసి ఉంచుతోంది. ఇదిలా ఉండగా అజయ్ దేవగన్ పాత్ర ఇందులో ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందని చాలా కీలకంగా కథను ప్రభావితం చేసేలా ఉంటుందని రాజమౌళి చెప్పిన సంగతి తెలిసింది.

అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఓ అప్ డేట్ హాట్ టాపిక్ గా మారింది. దాని ప్రకారం అజయ్ దేవగన్ పాత్ర సెకండ్ హాఫ్ లో వచ్చే 40 నిమిషాల ఫ్లాష్ బ్యాక్ లో సుమారు ఆర గంట దాకా ఉంటుందట. అప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు అయితే ఈ ఎపిసోడ్ ఇంకో ఎత్తు అనే రేంజ్ లో దీన్ని ప్లాన్ చేసినట్టు సమాచారం

మరో విశేషం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం ఓపెన్ అయిపోయింది. అజయ్ దేవగన్ రోల్ కూడా ఇదే తరహాలో భగత్ సింగ్ లక్షణాలతో పోరాడే వీరుడిగా ఉంటుందట. ఇతన్ని చూసే రామరాజు-భీమ్ లు స్ఫూర్తి చెంది స్వతంత్రం కోసం విప్లవ బాట పడతారట.

అజయ్ దేవగన్ కు ఇలాంటి పాత్ర కొత్త కాదు. చాలా ఏళ్ళ క్రితమే ది లెజెండ్ అఫ్ భగత్ సింగ్ లో అద్భుతమైన నటనతో మెప్పించడమే కాక అది బ్లాక్ బస్టర్ కావడంలో కీలక పాత్ర వహించాడు. అది చూసినందువల్లే రాజమౌళి ఇంకేమి ఆలోచించకుండా అజయ్ దేవగన్ ని ఫస్ట్ అండ్ బెస్ట్ ఛాయస్ గా ఎంచుకున్నాడట. చూస్తుంటే ఆర్ ఆర్ ఆర్ వీరుల సంగమంతో ఓ రేంజ్ లో రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తోంది