Begin typing your search above and press return to search.
'ఆర్.ఆర్.ఆర్' లో అజయ్ పాత్రపై క్రేజీ బజ్..!
By: Tupaki Desk | 31 May 2021 5:31 AM GMTదర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లకు ధీటుగా అజయ్ పాత్రని జక్కన్న తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది. అజయ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో, ఆయన పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందని హింట్ ఇచ్చారు. శత్రు మూకలు చుట్టుముట్టి తుపాకులు ఎక్కు పెట్టగా.. 'లోడ్ ఎయిమ్ షూట్' అంటూ గంభీరంగా డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు. దీంతో అజయ్ పాత్ర సినిమాలో ఎప్పుడు ఉంటుందన్న దానిపై చర్చలు మొదలయ్యాయి.
'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అజయ్ దేవగన్ పాత్ర ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజమౌళి గత చిత్రాల మాదిరిగానే ఇందులో కూడా పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇందులో అజయ్ దేవగన్.. అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ పాత్రలకు మార్గనిర్దేశం చేసే గురువుగా కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే సినిమా విడులయ్యే వరకు ఆగాల్సిందే.
కాగా, 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుండగా.. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్ హీరోయిన్ గా కనిపించనున్నారు. 1920 నేపథ్యంలో ఫిక్షనల్ పీరియాడికల్ మూవీగా 'ఆర్.ఆర్.ఆర్' తెరకెక్కుతోంది. కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డి. పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.