Begin typing your search above and press return to search.
స్టార్స్ అంతా చెప్పే ఆ మాట పెద్ద అబద్దం ఇదే!!
By: Tupaki Desk | 27 Nov 2018 4:45 AM GMTహిందీ ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న బుల్లి తెర టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’. ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో ప్రస్తుతం సీజన్ 6 సాగుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలతో ఇంటర్వ్యూలు చేసిన కరణ్ జోహార్ తాజాగా అజయ్ దేవగన్ - కాజోల్ జంటను తన టాక్ షో కు తీసుకు వచ్చాడు. వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న ఈ జంట ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోలు విడుదల చేశారు. చాలా సందడి సందడిగా టాక్ షో జరిగినట్లుగా టీజర్ లు చూస్తుంటే అనిపిస్తోంది.
సెలబ్రెటీలను చిత్ర విచిత్రమైన ప్రశ్నలు వేసి వారి నుండి ఆసక్తికర సమాధానాలు రాబట్టడంలో కరణ్ జోహార్ సిద్దహస్తుడు అంటూ ఇప్పటికే నిరూపితం అయ్యింది. తాజాగా అజయ్ దేవగన్ ను స్టార్స్ అందరు కూడా ఎక్కువగా చెప్పే కామన్ అబద్దం ఏంటీ అంటూ ప్రశ్నించాడు. అందుకు ఏమాత్రం తడుముకోకుండా ఐ లవ్ మై వైఫ్ అంటూ అజయ్ దేవగన్ చెప్పాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న కాజోల్ బిత్తరపోయింది. ఆ వెంటనే అజయ్ తేరుకుని నేను మిగతా వారిలా కాదు అంటూ పేర్కొన్నాడు.
ఇక ఆడవారు ఫొటోలు దిగేందుకు ఒక సెకన్ పడుతుంది. కాని వాటిని వారు పోస్ట్ చేసేందుకు రెండు మూడు గంటలు పడుతుందని తన భార్య కాజల్ వైపు చూస్తూ అజయ్ అనడం - పెళ్లి రోజు మర్చి పోయి తప్పు చెప్పడం ఇంకా పలు ఫన్నీ ఫన్నీ సంఘటనలు ఈ ఇంటర్వ్యూలో చోటు చేసుకున్నట్లుగా ప్రోమో ద్వారా తెలుస్తోంది. ప్రమో ఆసక్తికరంగా ఉండటంతో ఆదివారం ప్రసారం కాబోతున్న ఈ షో కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కొన్ని సంవత్సరాల క్రితం అజయ్ దేవగన్ నటించిన ఒక సినిమాకు పోటీగా కరణ్ తన సినిమాను విడుదల చేశాడు. ఆ సమయంలోనే కరణ్ నా సినిమాపై బ్యాడ్ పబ్లిసిటీ చేసేందుకు డబ్బులు ఖర్చు చేశాడంటూ అజయ్ దేవగన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దాంతో అప్పటి నుండి కూడా ఇద్దరి మద్య విభేదాలు నెలకొన్నాయి. అయితే కాజోల్ వల్ల మళ్లీ ఇద్దరు కలిసినట్లుగా సమాచారం అందుతోంది. ఇద్దరు వివాదం - విభేదంను పక్కన పెట్టి ఇలా కలిసి పోవడం ప్రేక్షకులకు సంతోషాన్ని కలిగించింది.