Begin typing your search above and press return to search.
ఊరికే హంగామా చేయకండి: అజయ్ దేవగణ్
By: Tupaki Desk | 9 April 2019 10:03 AM GMTమామూలుగా నెపోటిజం అని మరోటని కొంతమంది జనాలు ఊరికే గింజుకుంటారు కానీ మన సొసైటీలో అది విడదీయరాని అంశం. రాజకీయాల్లో అన్ని చోట్ల వారసులే ఉన్నారు. సినిమాల్లో అన్ని చోట్ల వారసులే ఉన్నారు. కపూర్ ఖాన్ దాన్ నుంచి మెగా ఫ్యామిలీవరకూ అందుకు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందుకే స్టార్ కిడ్స్ అంటే.. సాధారణ ఆడియన్స్ లోనూ.. మీడియాలోనూ ఎంతో ఆసక్తి వ్యక్తం అవుతూ ఉంటుంది. దీంతో ఒక్కోసారి సెలబ్రిటీ పేరెంట్స్ కూడా ఇబ్బంది పడుతుంటారు. రీసెంట్ గా అజయ్ దేవగణ్ కు అలంటి పరిస్థితే ఎదురైంది.
అజయ్ దేవగణ్ - కాజల్ దంపతులకు న్యాస.. యుగ్ అనే పిల్లలు ఉన్నారు. న్యాసకు 14 ఏళ్ళ వయసు. రీసెంట్ గా న్యాస పొట్టి స్కర్ట్ ధరించిన ఫోటోలు ఇంటర్నెట్ లో హల్చల్ చేయడంతో కొందరు నెటిజనులు తీవ్రంగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఈ విషయంపై స్పందించిన అజయ్ దేవగణ్ "పిల్లలను అలా ఉండనివ్వాల్సిందిగా మీడియావారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. తల్లిదండ్రులు ఫేమస్ అయినందుకు పిల్లలు ఎందుకు ఇబ్బంది పడాలి. బైటకొచ్చిన ప్రతిసారి వాళ్ళు చక్కగా రెడీ అయ్యి రారు కదా.. క్యాజువల్ గా వచ్చినపుడు దాన్ని హంగామా చేయడం అనససరం. న్యాసకు జస్ట్ 14 ఏళ్ళు. ఆ విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారు" అంటూ గట్టిగా చురకలటించాడు.
న్యాస మాత్రమే కాదు. షారూఖ్ కూతురైనా.. ఎవరైనా ఈ ట్రోలింగ్ కు అతీతం కాదు. ఫేమ్ అనే నాణేనికి రెండు వైపులు ఉంటే.. ఒక వైపు ఫ్రీ పబ్లిసిటీ అయితే.. రెండో వైపు ఇలాంటి ట్రోల్స్. దీన్ని ఎవరూ తప్పించుకోలేరు. పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ సెలబ్రిటీ లైఫ్!