Begin typing your search above and press return to search.
బ్యాడ్ విలన్ కి రెండో ఛాన్సిచ్చిన చెర్రీ
By: Tupaki Desk | 7 Sep 2015 7:45 AM GMTట్యాలెంటును ఎంకరేజ్ చేయడం లో రామ్ చరణ్ ఎప్పుడూ ముందుంటాడు. అతడు నటించిన ప్రతి సినిమాలో కొత్త నటీనటులకు ఛాన్సుంటుంది. కేవలం కథానాయికలకే కాదు.. విలన్లకూ ఓ ఛాన్సిచ్చి ఎంకరేజ్ చేస్తుంటాడు. అదే బాటలో ఇప్పుడు ఓ యంగ్ విలన్ ని చరణ్ ఎంకరేజ్ చేస్తున్నాడు. అతడి పేరు అజాజ్. మొట్టమొదటి సారి నాయక్ సినిమాలో చరణ్ అతడికి ఛాన్సిచ్చాడు. వినాయక్ తో కలిసి కాస్టింగ్ కోసం చర్చ జరిగినప్పుడు అజాజ్ ని ఎంకరేజ్ చేశాడు చరణ్. ఇప్పుడు రెండోసారి అతడికి అవకాశం ఇచ్చి శభాష్ అనిపించుకున్నాడు.
''చరణ్ తో నాయక్ లో నటించాను. ఇప్పుడు రెండో అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని సదరు బ్యాడ్ విలన్ అజాజ్ చెబుతున్నాడు. చరణ్ తనని తాను ఓ స్టార్ గా ఆవిష్కరించుకున్నాడు. ఇప్పుడు ప్రతిభకు ఛాన్సిస్తున్నారు. నేను నిజజీవితంలో ఎంత మంచిగా ఉంటానో, తెరపై అంత బ్యాడ్ విలన్ గా కనిపిస్తున్నా'' అంటూ నవ్వేశాడు అజాజ్. ఈసారి శ్రీనువైట్ల దర్శకత్వంలోని బ్రూస్ లీ లోనూ ఓ స్టయిలిస్ విలన్ గా నటిస్తున్నా. కోటు, స్పయిక్ ధరించి చాలా మోడ్రన్ గా కనిపిస్తాను. నల్ల రంగు జాకెట్లు ధరించిన ఓ కాంట్రాక్ట్ కిల్లర్ గా కనిపిస్తాను.. అని చెబుతున్నాడు.
ప్రస్తుతం బ్రూస్ లీ చిత్రీకరణ పాత బస్తీలో సాగుతోంది. అక్కడ చరణ్ సహా కీలక నటీనటులపై ముఖ్య సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. బ్రూస్ లీ దసరా బరిలో రిలీజ్ కి రెడీ అవుతోంది కాబట్టి ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ లో స్పీడ్ పెంచారని తెలుస్తోంది.