Begin typing your search above and press return to search.

'సూరారై పొట్రు’ బాగుంది.. టీమిండియా వైస్​కెప్టెన్​ రహానే..!

By:  Tupaki Desk   |   31 Jan 2021 12:00 PM IST
సూరారై పొట్రు’ బాగుంది.. టీమిండియా వైస్​కెప్టెన్​ రహానే..!
X
ఇటీవల ఆసీస్​ గడ్డ మీద భారతజట్టు ఘనవిజయం సాధించడంతో టీం ఇండియా వైస్​ కెప్టెన్​ రహానేకు ఎంతో పేరు వచ్చింది. అయితే ప్రస్తుతం రహానే చెన్నైలో ఉన్నారు. రహానే కెప్టెన్సీపై ఇటీవల ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఎంత ఒత్తిడి ఉన్నా.. రహానే కూల్​గా ఉంటాడని ప్రశంలు దక్కాయి. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న రహానే జట్టును చక్కగా ముందుకు నడిపించాడు. ఆస్ట్రేలియాపై టెస్ట్ సిరీస్ దక్కించుకోవడంలో సక్సెస్ అయ్యాడు. త్వరలో ఇంగ్లండ్​ సిరిస్​ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రహానే ఇన్​స్టాలో అభిమానులతో ముచ్చటించారు. వ్యక్తిగత అభిరుచులు తదితర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

'చెన్నైకి స్వాగతం, ఎప్పుడైనా ఏదైనా తమిళ సినిమా లేదా సిరీస్ చూసారా?' అని ఓ అభిమాని అడగ్గా.. ఇటీవల 'సూరారై పొట్రు' సినిమా చూశానని చాలా బాగుందని చెప్పాడు. తనకు తమిళం రాకపోయినా.. సబ్​ టైటిల్స్​తోనే అర్థం చేసుకున్నానని చెప్పాడు. సూర్య నటన చాలా బాగుందని.. దక్షిణాది చిత్రాలు చూస్తుంటానని వైవిధ్యంగా ఉంటాయని ప్రశంసించాడు.

మిసాల్‌, వడాపావ్‌ లో మీరు దేన్ని ఇష్టపడతారు? అని ఓ అభిమాని ప్రశ్నించాడు. ఇది 'కఠినమైన ప్రశ్న అని, వడాపావ్'‌ అని బదులిచ్చాడు. నటరాజన్‌, మొహ్మద్ సిరాజ్‌, శుభ్‌మన్‌ గిల్‌, వాషింగ్టన్ సుందర్‌ గురించి చెప్పండి? అని మరో అభిమాని అడగ్గా.. వాళ్ల చాలా గొప్పగా ఆడతారు. ఫలితం గురించి ఆలోచించారు. గొప్ప ప్రదర్శన చేయాలని మాత్రమే చూస్తారు. అంటూ చెప్పాడు రహనే. ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? అని అడగ్గా సంగీతం వింటుంటానని సమాధానం చెప్పాడు. మీ భార్య రాధికను తొలిసారి ఎక్కడ చూశారని మరో అభిమాని అడగగా.. ఆమె నా భార్య స్నేహితురాలని చెప్పారు. అలా పరిచయమే మా వివాహానికి దారి తీసిందని చెప్పారు.