Begin typing your search above and press return to search.
టీవీ రేటింగ్స్-ఫ్యాన్స్ ఫైటింగ్స్
By: Tupaki Desk | 27 Jan 2018 7:43 AM GMTతమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ అభిమానులు గొప్పలు చెప్పుకోవడం ఎక్కడైనా సహజమే కాని సౌత్ లో ఇది కొంచెం ఎక్కువ మోతాదులో ఉంటుంది. తమిళ్ లో అయితే మరీనూ. సినిమా తారల కోసం ఏకంగా గుళ్ళు గోపురాలు కట్టే దాకా వెళ్ళిపోతారు. మన వైపు అంత ఫానిజం లేదు లేండి. కోలీవుడ్ లో రజనీకాంత్ ను మినహాయిస్తే సమాంతరమైన పోటీ ఉన్నట్టుగా చెప్పుకునే అజిత్ - విజయ్ ఫాన్స్ మధ్య ఈ వార్ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో కలెక్షన్లు - యు ట్యూబ్ టీజర్ లైక్స్ అంటూ లెక్కలు చూసుకుని సోషల్ మీడియాలో ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటల బాణాలు విసురుకున్నారు. నిజానికి అజిత్ అధికారికంగా ఆమోదించిన అభిమాన సంఘం తమిళనాట ఒక్కటి కూడా లేదు. తన పేరు ఉండే అలాంటివాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు అజిత్. కాని ఫాన్స్ మాట వినే రకం కాదుగా. వాళ్ళ మానన వాళ్ళు సంఘాలు పెట్టేసుకున్నారు.
ఇప్పుడు ఈ ఇద్దరి హీరోల అభిమానులు టీవీ టిఆర్పి రేటింగ్ విషయంలో సోషల్ మీడియాలో గొడవ పడటం వింతగా తోస్తోంది. అజిత్ నటించిన వీరం సినిమా మొదటిసారి టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు ఎన్నడు లేని రీతిలో 18.1 రేటింగ్ తెచ్చుకుని టాప్ 1 ప్లేస్ తీసుకుంది. ఇటీవలే దీన్ని రెండో సారి టెలికాస్ట్ చేస్తే 9 తెచ్చుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే అదే టైంలో విజయ్ టీవీలో వస్తున్న అవార్డ్స్ ఫంక్షన్ కూడా 10 రేటింగ్ తో దానికి అతి దగ్గరలో నిలిచింది. కోలీవుడ్ లో క్రేజ్ విషయంలో టాప్ లో నిలిచిన కబాలి(11.7) - అర్రం(11) - కరుప్పన్10.5)తో తర్వాత ప్లేసులు తీసుకోగా మొన్న వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచిన మెర్సల్(అదిరింది)8.5 తో సర్దుకుంది.
అదిగో అదే ఇప్పుడు అజిత్ ఫాన్స్ ఎత్తి చూపుతున్నారు. విజయ్ సూపర్ హిట్ సినిమా మొదటిసారి వచ్చినప్పటి రేటింగ్ కంటే అజిత్ సినిమా రెండో సారి టెలికాస్ట్ అవుతున్నప్పుడు వచ్చిన రేటింగ్ ఎక్కువ అంటూ ఉదాహరణ చూపుతూ అజిత్ గొప్ప అనేలా చెప్పుకోవడం మొదలుపెట్టడంతో అజిత్ ఫ్లాప్ సినిమాల రేటింగ్స్ చూపిస్తూ విజయ్ ఫాన్స్ కూడా ఎదురుదాడి స్టార్ట్ చేసారు. అయినా టీవీ రేటింగ్స్ ని పట్టుకుని హీరోల స్టార్ డం లేక్కలేసుకునే దాకా వచ్చారంటే దీన్ని ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. ఈ వీరం సినిమానే పవన్ కళ్యాణ్ తెలుగులో కాటమరాయుడుగా చేస్తే మనవాళ్ళు మొహమాటం లేకుండా తిరస్కరించారు.