Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరో మరో సాహస యాత్ర.. ఈసారి రికార్డ్‌ బ్రేక్‌

By:  Tupaki Desk   |   19 Jan 2021 5:47 AM GMT
స్టార్‌ హీరో మరో సాహస యాత్ర.. ఈసారి రికార్డ్‌ బ్రేక్‌
X
తమిళ సూపర్‌ స్టార్ అజిత్ కు బైక్‌ డ్రైవింగ్‌ అంటే చాలా ఇష్టం అనే విషయం అందరికి తెల్సిందే. చిన్న హీరోలు కూడా ప్రస్తుతం బైక్‌ పై తిరిగేందుకు ఇష్టపడరు. కాని అజిత్ మాత్రం వందలు వేల కిలో మీటర్లు బైక్‌ పై తిరిగేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. ఈ వయసులో కూడా అజిత్ ఇంకా రెగ్యులర్ గా బైక్ డ్రైవ్‌ లు చేస్తూనే ఉంటాడు. లాక్ డౌన్‌ సమయంలో హైదరాబాద్‌ నుండి చెన్నై వరకు అజిత్ బైక్ పై వెళ్లాడు అంటూ వార్తలు వచ్చాయి. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు వారణాసి, ఇంకా ఉత్తర భారతం కు బైక్ రైడ్‌ చేస్తున్నాడు.

అజిత్ ఇప్పటికే 4500 కిలో మీటర్లను బైక్‌ పై ట్రావెల్ చేసి చేరుకున్నారు. వారణాసిలో బైక్ తో దిగిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇంత భారీ రైడ్‌ ను ఏ ఒక్క హీరో కూడా చేయలేదు అనడంలో సందేహం లేదు. ఒక హీరోగా ఇంత రైడ్‌ చేయడం రికార్డ్‌ గా చెప్పుకోవచ్చు. అద్బుతమైన రికార్డును తన సొంతం చేసుకున్న అజిత్‌ త్వరలో వినోథ్ హెచ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న వలిమై సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వలిమై సినిమా షూటింగ్ ఎక్కువ శాతం హైదరాబాద్ లోనే చిత్రీకరణ జరిపారు.