Begin typing your search above and press return to search.

బైక్ ని గాల్లోకి లేపి త‌ళా విన్యాసం షాకిస్తోందిగా

By:  Tupaki Desk   |   27 Nov 2020 6:15 AM GMT
బైక్ ని గాల్లోకి లేపి త‌ళా విన్యాసం షాకిస్తోందిగా
X
త‌ళా అజిత్ క్రేజీ రేస‌ర్ అన్న సంగ‌తి తెలిసింది త‌క్కువ‌మందికే. ఆయ‌న యుక్త‌వ‌య‌స్కుడిగా ఉన్న‌ప్పుడు రేసింగ్ కాంపిటీషన్స్ లో స‌త్తా చాటారు. బైక్ రేస్ .. కార్ రేస్ ఆయ‌న‌కు కొత్తేమీ కాదు. ఇప్పుడు ఆయ‌న నైజం స్వ‌భావ‌మే క‌థాంశంగా మారింది. సినిమాగా వెండితెర‌కెక్కుతోంది.

హెచ్ వినోద్ ద‌ర్శ‌కుడిగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీని బోనీక‌పూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో అజిత్ భారీ యాక్ష‌న్ స‌న్ని వేశాల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే ఇదిగో ఇలా బైక్ ఫ్రంట్ వీల్ ని గాల్లో లేపి సాహ‌సాలు చేస్తున్నారు. ఇలాంటి డేరింగ్ ఫీట్స్ వేస్తుండ‌గానే ఇటీవ‌ల ఆయ‌న‌కు గాయాల‌య్యాయి. అయినా ఆయ‌న దానికి బెద‌ర‌లేదు. మొండిగా మ‌ళ్లీ రియ‌ల్ స్టంట్స్ కి సిద్ధ‌మ‌య్యారు. డూప్ అన్న‌దే లేకుండా ఆయ‌న బైక్ రేసింగ్ విన్యాసాలు అద‌ర‌గొడుతున్నార‌ని తాజాగా రిలీజైన ఫోటో చెబుతోంది.

ఈ సినిమా టైటిల్ ‘వాలిమై’. అజిత్ కెరీర్ బెస్ట్ విన్యాసాల్ని ఈ మూవీలో చూడ‌బోతున్నాం. సూపర్ బైక్ సాహ‌సాల్ని హైలైట్ గా తెర‌కెక్కిస్తున్నార‌ట‌. ఎంత పెద్ద హీరోలైనా అజిత్ తరహాలో ఇలా సొంతగా బైక్ స్టంట్స్ చేయలేరు అంటూ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి హుమా ఖురేషి కథానాయికగా నటిస్తుండగా టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ నెగెటివ్ రోల్ చేస్తున్నారు. 2021 వేసవి కానుకగా మూవీ విడుదలకానుంది.