Begin typing your search above and press return to search.
బెనిఫిట్ షోలో అభిమానుల అరాచకం
By: Tupaki Desk | 2 March 2019 6:51 AM GMTపురుషులలో పుణ్య పురుషులు వేరయా అన్నట్టు అభిమానుల్లో అరవ ఫ్యాన్స్ వేరయా అనే సమేత అతికినట్టు సరిపోతుంది. ఎక్కడైనా స్టార్ హీరోల సినిమాలకు మొదటి రోజు తెల్లవారఝామున స్పెషల్ షోలు వేయడం అన్ని చోట్లా ఉండేదే. దీనికి అభిమానులు చేసే హంగామా మాములుగా ఉండదు. అసలు తెరమీద ఏం జరుగుతుందో ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవడం కష్టం అనిపించే రేంజ్ లో నానా రచ్చ ఉంటుంది. దీని కోసమే వెళ్ళేవాళ్ళే ఎక్కువగా ఉంటారు.
అయితే అజిత్ ఫ్యాన్స్ మా రూటే సెపరేటు అంటున్నారు. నిన్న జరిగిన సంఘటనే అందుకు ఉదాహరణ. చెన్నైలోని ప్రముఖ రోహిణి థియేటర్లో విశ్వాసం 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా స్పెషల్ షోలు వేసారు. దీనికి సంబంధించిన అడ్వాన్సు బుకింగ్ రెండు వారాల క్రితమే అమ్మేశారు కూడా. అనూహ్యంగా ఊహించిన దాని కన్నా ఎక్కువ రద్దీ వచ్చింది. ఇది యాభై రోజా లేకా అజిత్ కొత్త సినిమా ఇంకోటి విడుదల చేసారా అనే రేంజ్ లో జనం కొట్టుకున్నారు.
ఇదిలా ఉండగా సినిమా ఆడుతుండగా శృతి తప్పిన అజిత్ అభిమానులు నానా గొడవ చేయడంతో ఫర్నీచర్ తో ఎంతో విలువైన స్క్రీన్ కూడా కొంత మేర చిరిగిపోయింది. హాల్ మొత్తం చెత్త చెదారంతో పాటు మందు సీసాలు కూడా పగలగొట్టేసారు. దీంతో థియేటర్ ఓనర్ ట్విట్టర్ లో దీని గురించి ట్వీట్ చేస్తూ తమ భద్రతకు హామీ ఇచ్చే దాకా ఇకపై మా హాల్ లో ఎలాంటి స్పెషల్ షోలు ఉండవని ట్వీట్ చేసాడు. స్వేచ్చ ఇస్తే దాన్ని పూర్తిగా దుర్వినియోగపరిచారని ఆవేదన వ్యక్తం చేసారు. సింగల్ స్క్రీన్ కాబట్టి మల్టీ ప్లెక్స్ తరహాలో ఇక్కడ వ్యక్తిగత చెకింగ్ అంటూ ఏదీ ఉండదు. అందుకే ఇంత రభస