Begin typing your search above and press return to search.
స్టార్ హీరో పై అభిమానుల అసంతృప్తి.. గుడ్డి నమ్మకం వద్దంటూ విజ్ఞప్తి
By: Tupaki Desk | 4 March 2022 4:31 AM GMTతమిళ స్టార్ హీరో అజిత్ తాజాగా వాలిమై సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా కు మిశ్రమ స్పందన వచ్చింది. తెలుగు లో కూడా విడుదల అయినా కూడా జనాలు పెద్దగా పట్టించుకోలేదు. తమిళంలో అజిత్ కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో వంద కోట్ల మార్క్ ను చేరుకుంది కాని ఆ సినిమాకు అంత సీన్ లేదు అనేది కొందరి అభిప్రాయం. తమిల సినీ ప్రేక్షకులు కూడా వాలిమై సినిమాను యావరేజ్ గానే తేల్చారు.
ఓపెనింగ్స్ భారీగా వచ్చిన వాలిమై కి లాంగ్ రన్ లో దెబ్బ పడింది. అనూహ్యంగా వసూళ్లు డ్రాప్ అయ్యాయి అంటేనే సినిమా రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సన్నివేశాలను పెట్టిన దర్శకుడు హెచ్ వినోద్ ఒక మంచి ఎంటర్ టైనర్ గా సినిమాను మల్చలేక పోయాడు అనే రివ్యూలు కూడా వచ్చాయి. మొత్తానికి వాలిమై సినిమా కోసం రెండేళ్లుగా అభిమానులు ఎదురు చూస్తే యావరేజ్ గానే నిలిచింది.
హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ అంతకు ముందు బాలీవుడ్ 'పింక్' రీమేక్ 'నేర్కొండ పార్వై' ను చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ గా అదే రీమేక్ ను చేసి కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ అందుకుంటే నేర్కొండ పార్వై సినిమా మాత్రం నిరాశ పర్చింది. కమర్షియల్ గా ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వాలిమై కి కూడా ఆయనే దర్శకుడు అనడంలో అభిమానులు అప్పుడే అవసరమా అన్నట్లుగా విమర్శలు చేశారు.
ఇప్పుడు వాలిమై తర్వాత మళ్లీ వినోద్ దర్శకత్వంలో నే అజిత్ సినిమాను చేయబోతున్నాడు. వాలిమై ఫలితం తేలిపోయిన తర్వాత కూడా ఆయనతోనే సినిమాకు ఎలా కమిట్ అవుతారు అంటూ అజిత్ ను కొందరు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. అభిమానులు ముఖ్యంగా ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అజిత్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
అజిత్ గతంలో కూడా ఒక దర్శకుడితో ప్లాప్ ఇచ్చినా సక్సెస్ ఇచ్చినా కంటిన్యూస్ గా మూడు నాలుగు సినిమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు హెచ్ వినోద్ తో రెండు సినిమాలు అయ్యాయి. కనుక మరో ఒకటో రెండో సినిమాలు చేసే వరకు ఆయనతోనే కంటిన్యూ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అజిత్ దర్శకులను ఇలా గుడ్డిగా నమ్మడం.. కొత్త వారికి ఛాన్స్ ఇవ్వక పోవడం వల్ల మంచి సినిమాలను మిస్ అవుతున్నాడు అంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సక్సెస్ ఫుల్ దర్శకులు చాలా మంది అజిత్ తో సినిమా ను చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. అలాంటి వారికి ఛాన్స్ ఇవ్వకుండా చేసిన వారితోనే మళ్లీ మళ్లీ చేయడం ద్వారా విభిన్నమైన సినిమాలు రావని అభిమానులు అంటున్నారు. వచ్చే సినిమా నుండి అయినా అజిత్ తన పద్దతి మార్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.