Begin typing your search above and press return to search.

100 కోట్ల రెమ్యూనరేషన్ క్లబ్ లో అజిత్

By:  Tupaki Desk   |   22 Jan 2023 2:30 PM GMT
100 కోట్ల రెమ్యూనరేషన్ క్లబ్ లో అజిత్
X
పాన్ ఇండియా సినిమాల హవా మొదలైన తర్వాత సినిమాల బడ్జెట్ అమాంతం పెరిగిపోయింది. అదే సమయంలో ఇండియన్ వైడ్ గా హీరోలు తమ మార్కెట్ ని ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వారు కూడా తమ రెమ్యూనరేషన్ పెంచేశారు. పాన్ ఇండియా లెవెల్ లో ఒక్క సక్సెస్ పడితే రెమ్యూనరేషన్ పీక్ లోకి వెళ్ళిపోతుంది. సినిమాకి ఏకంగా 100 కోట్ల వరకు తీసుకోవడానికి హీరోలు సిద్ధంగా అవుతున్నారు. తమ కష్టానికి, తమకున్న మార్కెట్ వ్యాల్యూకి ఆ మాత్రం రెమ్యూనరేషన్ తప్పేం కాదని హీరోలతో పాటు నిర్మాతలు కూడా భావిస్తున్నారు.

దీంతో పాన్ ఇండియా స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనుకునేవారు హీరో రెమ్యూనరేషన్ 100 కోట్లతో పాటు అదనంగా నిర్మాణానికి మరో వంద కోట్లు రెడీ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్స్ అయిన ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, తారక్, సూపర్ స్టార్ మహేష్ బాబు తమ నెక్స్ట్ సినిమాల కోసం 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ప్రభాస్ బడ్జెట్ అయితే ఏకంగా 150 కోట్లు దాటిపోయిందనే మాట కూడా వినిపిస్తుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటివరకు 80 కోట్ల వరకు తీసుకుంటున్నారు. అయితే రాజమౌళితో చేయబోయే సినిమా కోసం అతనికి 100 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఈ జాబితాలోకి కోలీవుడ్ నుంచి స్టార్ హీరో అజిత్ వచ్చి చేరాడనే మాట వైరల్ గా మారింది. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో అజిత్ కుమార్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు.

ఈ సినిమా కోసం అన్ని భాషల నుంచి నటులను ఎంపిక చేస్తున్నారు. ఈ మూవీలో అజిత్ కి జోడిగా నయనతార నటిస్తుంది. ప్రతినాయక పాత్రలో ఐశ్వర్యరాయ్ ఫైనల్ అయినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం అజిత్ కి 100 కోట్లు రెమ్యూనరేషన్ కింద ఇస్తున్నట్లు సమాచారం. పిరియాడికల్ జోనర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.