Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : సూపర్ స్టార్‌ ఫ్యామిలీ రేక్‌ క్లిక్‌

By:  Tupaki Desk   |   26 Jun 2023 11:11 AM GMT
పిక్ టాక్ : సూపర్ స్టార్‌ ఫ్యామిలీ రేక్‌ క్లిక్‌
X
తమిళ సూపర్‌ స్టార్‌ అజిత్ కుమార్‌ భార్య షాలిని మరియు అతని పిల్లలు అనౌష్క ఇంకా ఆద్విక్‌ లు చాలా అరుదుగా మాత్రమే మీడియాలో కనిపిస్తూ ఉంటారు. పబ్లిసిటీకి.. మీడియాకు దూరంగా ఉండే అజిత్‌ కుమార్‌ పిల్లలు ఇద్దరు తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తీసుకున్న ఫోటో వైరల్‌ అవుతోంది.

అజిత్ కుమార్‌ భార్య షాలిని సోదరి అయిన షామ్లీ 'షీ' అనే పేరుతో ఆర్ట్‌ గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఆర్ట్‌ గ్యాలరీ కి షాలిని తన పిల్లలతో కలిసి హాజరు అయ్యింది. ఆ సందర్భంగా తీసుకున్న ఈ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

షామ్లీ చిన్నతనంలో ఎన్నో సినిమాల్లో బాల నటిగా నటించింది. ఓయ్‌ సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. హీరోయిన్ గా ఆశించిన స్థాయి లో సక్సెస్ మరియు గుర్తింపు రాలేదు. దాంతో చేసేది లేక ఇండస్ట్రీకి షామ్లీ దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే.

ఇదే సమయంలో ఆమె తనకు ఉన్న ఆర్ట్‌ ఇంట్రెస్ట్‌ తో చెన్నై లో ఒక భారీ ఆర్ట్‌ ఎగ్జిబీషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి అజిత్ కుమార్ షాలిని దంపతులు పిల్లలతో హాజరు అవ్వాల్సి ఉన్నా కూడా... అజిత్ ఇతర పనులతో బిజీగా ఉండటం వల్ల షాలిని మరియు పిల్లలు మాత్రమే హాజరు అయ్యారు.

అజిత్ కుమార్‌ ఈ ఫ్రేమ్‌ లో మిస్ అయినా కూడా షాలిని ఇద్దరు పిల్లలు మరియు షామ్లీ లు ఉన్న ఈ క్లిక్ కచ్చితంగా ఎప్పటికి అజిత్‌ అభిమానులకు గుర్తుండి పోతుంది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా లో ఈ ఫోటో వైరల్‌ అవుతోంది.