Begin typing your search above and press return to search.
క్లాసిక్ రీమేక్ లో మసాలా తాళింపు
By: Tupaki Desk | 5 April 2019 5:30 PM GMTఅమితాబ్ బచ్చన్ తాప్సి ప్రధాన పాత్రల్లో మూడేళ్ళ క్రితం వచ్చిన పింక్ ఎంతటి సంచలన విజయం సాధించిందో చూశాం. లైంగిక వేధింపుల అంశం మీద రూపొందిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా విమర్శకుల ప్రశంశలు అందుకుంది. ముఖ్యంగా తాప్సికి బాలీవుడ్ లో మంచి కెరీర్ ని ఇచ్చింది. ఇప్పుడు దీని రీమేక్ లో తమిళ్ లో అజిత్ హీరోగా నీర్కొండ పార్వై పేరుతో వినోత్ దర్శకత్వంలో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్ లో కేవలం రెండు నెలలలోపే మొత్తం షూటింగ్ పూర్తి చేసి షాక్ ఇచ్చింది యూనిట్. ఇదిలా ఉండగా పింక్ ఆసాంతం చాలా సీరియస్ గా సాగే సబ్జెక్టు. ఎక్కడా ఒక్క శాతం డీవియేషన్ ఉండదు. నేరేషన్ మొత్తం అలా కళ్ళప్పగించి చూసేలా ఉంటుంది. కాని అజిత్ మాస్ హీరో. ఒక ఫార్ములాకు కట్టుబడి సినిమాలు చేసే స్టార్. ఏమి లేని రొటీన్ సినిమా విశ్వాసంకు అక్కడ వంద కోట్లు వసూళ్లు రావడానికి ఇదే కారణం. మరి అంత పెద్ద అజిత్ తో అమితాబ్ వేసిన లాయర్ పాత్ర ద్వారా మాస్ ని మెప్పించడం కష్టం.
అందుకే అజిత్ కు ఇందులో ఓ ఫ్లాష్ బ్యాక్ జోడించారట. ఓ ఫైట్ తో పాటు పాట కూడా యాడ్ చేసినట్టు తెలిసింది. ఆ ఎపిసోడ్ మొత్తం అజిత్ ఎంత వాడు గాని తరహాలో క్లీన్ షేవ్ తో ఉంటాడు. అది అయ్యాక లాయర్ గా గెడ్డం తో కనిపిస్తాడు. ఇది ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న ఫీల్ ను చంపెస్తుందేమో అన్న అనుమానం ఇప్పుడు వ్యక్తం అవుతోంది. ఇలా మాస్ హీరో అనే సాకుతో అంత ఇంటెన్సిటీ ఉన్న కథలో ఇలా బలవంతంగా ఇరికించడం తేడా కొడుతుందని చెబుతున్నారు. దీని అవుట్ పుట్ ఎలా వచ్చిందో తెలియాలంటే వచ్చే నెల దాకా ఆగాల్సిందే