Begin typing your search above and press return to search.
దొంగ పోలీస్ స్టోరిలో అజిత్ వర్సెస్ నాగార్జున?
By: Tupaki Desk | 1 Feb 2022 5:30 PM GMTఇది అరుదైన కాంబినేషన్. ఇద్దరు ఎక్స్ పెరిమెంటల్ హీరోలు కలిసి పని చేయబోతున్నారు. అందులో ఒకరు తళా అజిత్ కాగా.. ఇంకొకరు కింగ్ నాగార్జున. సదరు కోలీవుడ్ టాలీవుడ్ స్టార్ హీరోలు కలిసి నటించడం ఇదే మొదటిసారి. ఆ ఇద్దరికీ పోలీస్ పాత్రల్లో చాలా ఇమేజ్ ఉంది. స్టైలిష్ కాప్ డ్రామాల్లో అదరగొట్టిన రికార్డ్ ఉంది.
అలాంటి ఒక కాప్ స్టోరీ కోసం ఈ జోడీ చేతులు కలుపుతున్నారని గుసగుస వినిపిస్తోంది. తళా అజిత్ నటించిన `వాలిమై` ఫిబ్రవరి 24 న థియేట్రికల్ గా విడుదలవుతోంది. తదుపరి హెచ్ వినోద్ - బోనీ కపూర్ లతో ఒక ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభించనున్నారు. ఇది దొంగతనాల ఆధారంగా రూపొందే భారీ యాక్షన్ థ్రిల్లర్. మార్చి 9 న లాంఛనంగా ప్రారంభమవుతుంది. తాజా సమాచారం మేరకు.. సీనియర్ పోలీస్ కమీషనర్ పాత్ర కోసం మేకర్స్ సీనియర్ హీరోని వెతుకుతున్నారు. మలయాళం తెలుగు పరిశ్రమల నుండి పలువురు నటీనటులను ఎంపిక చేయాలనేది ప్లాన్. అజిత్ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా కమీషనర్ పాత్ర కోసం నాగార్జున లేదా మోహన్ లాల్ ని తీసుకోవాలని టీమ్ చూస్తోంది.
అజిత్ కి తగిన ప్రత్యర్థిగా ఈ పాత్ర చాలా కీలకం కానుంది. కింగ్ నాగార్జునకు పోలీస్ అధికారిగా చక్కని ఇమేజ్ ఉంది. ఇటీవల వైల్డ్ డాగ్ లో ఎన్.ఐ.ఏ అధికారిగా అదరగొట్టారు. అందుకే అతడి ఎంపిక సరైనదేనని అంతా భావిస్తున్నారు. నాగ్ పోలీసుగా చాలా ఫిట్ గా పవర్ ఫుల్ గా కనిపిస్తాడు. ఖాకీ డ్రెస్ కి నాగ్ పర్ఫెక్ట్ యాప్ట్ గనుక అజిత్ అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. మరో రెండు వారాల్లో దీనిపై మరింత క్లారిటీ రానుంది. ప్రస్తుతానికి నాగార్జున .. మోహన్‌లాల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే AK 61 కి నాయికను ఎంపిక చేయనున్నారు. అదితి రావ్ హైదరి ఆల్మోస్ట్ ఎంపిక కానుంది. ఈ చిత్రం 2023 సంక్రాంతి రిలీజ్ లక్ష్యంగా తెరకెక్కించనున్నారు.