Begin typing your search above and press return to search.
తెగింపు సినిమా తెలుగులో ఇక కష్టమే..
By: Tupaki Desk | 22 Jan 2023 12:30 PM GMTతమిళ్ స్టార్ హీరో అజిత్ హీరోగా వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తునివు. ఈ మూవీ తెలుగులో తెగింపు టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమాని బోనీకపూర్ నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక సంక్రాంతి బరిలో జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజు యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే అజిత్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా భారీగానే ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి స్పందన వచ్చింది.
అజిత్ గత సినిమాలో హిట్ కావడంతో ఆ హైప్ తెగింపు మూవీకి ఉపయోగపడింది. క్రైమ్ రాబరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా హాలీవుడ్ హిట్ మూవీ మనీ హిస్ట్ స్ఫూర్తితో తీసినట్లు ఉందని టాక్ వచ్చింది. ఇదిలా ఉంటే తమిళంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ పూర్తిచేయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 163.32 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది. ఓవరాల్ గా 84.83 కోట్ల షేర్ రాబట్టింది. దీంతో అజిత్ కెరియర్ లో మరో బ్లాక్ పాస్టర్ హిట్గా ఈ సినిమా నిలిచిందని చెప్పాలి. ఇదిలా ఉంటే తెలుగులో ఈ మూవీ డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది.
మొదటిరోజు పర్వాలేదని టాక్ వచ్చినా కూడా సంక్రాంతి పోటీలో వాల్తేర్ వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు రిలీజ్ అయ్యాయి. టాలీవుడ్ లో మెజారిటీ ఆడియన్స్ ఈ రెండు సినిమాలు చూడడానికి ఆసక్తి చూపించారు. ఈ నేపథ్యంలోనే తెగింపు సినిమాకి కేటాయించిన థియేటర్స్ సంఖ్య కూడా తగ్గిపోయింది. కేవలం 100 థియేటర్స్ లో మాత్రమే ఈ సినిమా తర్వాత నడిచింది. ఈ రెండు సినిమాల ప్రభావం తెగింపు మూవీపై గట్టిగానే పడింది అని చెప్పాలి. ఓవరాల్ గా ఈ సినిమా తెలుగులో 3.92 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
దీంట్లో రెండు కోట్ల షేర్ వచ్చింది. 3.50 కోట్ల బ్రేక్ ఈవెంతో రిలీజ్ అయిన తెగింపు సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవాలంటే మరో 1.50 కోట్ల వరకు కలెక్ట్ చేయాల్సి ఉంది. అయితే ఈ కలెక్షన్స్ అయితే ఇక సాధించడం కష్టం అని చెప్పాలి. దీనిని బట్టి తెలుగులో మాత్రం తెగింపు మూవీ డిజాస్టర్ ఖాతాలోకి వెళ్ళిపోయిందని చెప్పాలి. దీనికంటే వారసుడు కాస్తా మెరుగైన కలెక్షన్స్ ని తెలుగులో సాధించాయని చెప్పాలి.