Begin typing your search above and press return to search.
తమిళ స్టార్ హీరోకు శస్త్ర చికిత్స!
By: Tupaki Desk | 9 Sep 2017 5:12 PM GMTతమిళనాడు లో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అజిత్. వివేగం చిత్రంతో తమిళంలో మంచి హిట్ అందుకున్నాడు అజిత్. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టెయినర్ గా రూపొందిన ఈ చిత్రం కోసం అజిత్ సిక్స్ ప్యాక్ బిల్డ్ చేశాడు. వివేగంలో దాదాపుగా గంటన్నరపాటు యాక్షన్ సన్నివేశాలున్న సంగతి తెలిసిందే. వివేగం సినిమా కోసం బల్గేరియాలో ఫైటింగ్ సన్నివేశాల సందర్భంగా అజిత్ భుజానికి బలమైన గాయం అయ్యింది. దానికి సంబంధించిన ఆపరేషన్ ను ఈ నెల 7న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నిర్వహించారు.
గతంలో కూడా సొంతంగా ఫైట్ సీన్లు చేస్తూ అజిత్ చాలా సార్లు శస్త్ర చికిత్సలు చేయించుకున్నాడు. వెడలం సినిమా సందర్భంగా కూడా గాయపడ్డ అజిత్ మోకాలికి ఆపరేషన్ జరిగింది. చాలా వరకు యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా నటించడానికి ప్రయత్నించే అజిత్ ఈ సినిమాలో కూడా అలాగే చేశాడట. బల్గేరియాలో గాయపడ్డ అజిత్ వెంటనే అక్కడ ప్రథమ చికిత్స చేయించుకుని షూటింగ్‌లో పాల్గొన్నాడట. నెలలోపు శస్త్ర చికిత్స చేయించుకోవాలని అక్కడి వైద్యులు సూచించారట. దీంతో, రెండు రోజుల క్రితం ఆయన భుజానికి చెన్నై వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని వైద్యులు చెప్పారు. రెండు నెలల పాటు అజిత్ బెడ్ రెస్ట్ తీసుకోవాలని వారు సూచించారు. అజిత్ ఆరోగ్యంగా ఉన్నారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.