Begin typing your search above and press return to search.

షూటింగ్ షురూ చేయనున్న స్టార్ హీరో 'పాన్ ఇండియా మూవీ'

By:  Tupaki Desk   |   31 July 2020 12:30 AM GMT
షూటింగ్ షురూ చేయనున్న స్టార్ హీరో పాన్ ఇండియా మూవీ
X
తమిళ స్టార్ హీరో అజిత్.. సౌత్ ఇండియన్ సినీ ప్రేక్షకులందరికి తెలుసు. ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్న అజిత్ ప్రస్తుతం ఓ పవర్ ఫుల్ పోలీస్ అధికారి స్టోరీతో సిద్దమవుతున్నాడు. ఇదివరకు డైరెక్టర్ శివ దర్శకత్వంలో వరుసగా నాలుగు హిట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఇక గతేడాది హిందీ పింక్ మూవీ రీమేక్ 'నిర్కొండ పార్వై' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం పింక్ మూవీ తెలుగులో కూడా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా నిర్కొండ పార్వై ఫేమ్ హెచ్.వినోద్ దర్శకత్వంలోనే అజిత్ రెండో సినిమా చేస్తున్నాడు. అయితే ఆ సినిమా పాన్ ఇండియా మూవీగా రూపొందించే ప్లాన్ లో ఉన్నారట దర్శక నిర్మాతలు. 'వాలిమై' పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీని ప్రముఖ ప్రొడ్యూసర్ బోనీకపూర్ నిర్మిస్తుండగా.. హ్యూమా ఖురేషి హీరోయినుగా నటిస్తుంది.

లాక్ డౌన్ ముందు వరకు హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా చిత్రీకరణ 40% పూర్తయినట్లు తెలుస్తుంది. బైక్‌ రేసింగ్‌ నేపథ్యంలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారట. అయితే ఈ చిత్రీకరణలో వాడిన బైక్‌ అజిత్ కి ఎంతో నచ్చటంతో ఆ బైక్‌ మీదే హైదరాబాద్‌ నుంచి చెన్నై వరకు వెళ్లి మొన్నే వార్తలలో నిలిచాడు. తాజా సమాచారం ప్రకారం.. వాలిమై షూటింగ్ వచ్చే నెల నుండి ఆర్ఎఫ్సిలో స్టార్ట్ చేయనున్నారట. పాన్ ఇండియా మూవీగా తమిళ, తెలుగు, హిందీ బాషలలో ఈ సినిమా విడుదల కాబోతుందని అంటున్నారు. ఇక తెలుగు యంగ్ హీరో కార్తికేయ ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను నవంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారట చిత్రయూనిట్‌. కానీ ప్రస్తుతం మహమ్మారి కారణంగా అన్ని కార్యక్రమాలు ఆగిపోవటంతో రిలీజ్‌ వాయిదా పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.