Begin typing your search above and press return to search.
స్టార్ హీరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చేది అప్పుడేనా..?
By: Tupaki Desk | 28 Nov 2020 9:50 AM GMTకోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం ''వలిమై'' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ 'పింక్' రీమేక్ గా వచ్చిన 'నెర్కొండ పార్వై' చిత్రం తరువాత టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్.వినోద్ - తలా అజిత్ కాంబోలో వస్తున్న సినిమా ఇది. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో 'కాలా' ఫేమ్ హ్యూమా ఖురేషి హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా 'Rx100' హీరో కార్తికేయ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్ లో కనిపించనున్నాడు. ఇందులో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని 2020 దీపావళికి లేదంటే 2021 సంక్రాంతికి విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. అయితే కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్ నిలిచిపోయింది.
కోవిడ్ నేపథ్యంలో ఇటీవలే 'వలిమై' చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ లో అజిత్ పాల్గొనే కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ 2021 మార్చి నాటికి పూర్తి చేసి సమ్మర్ లో రిలీజ్ చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. త్వరలోనే ‘వలిమై’ విడుదల తేదీకి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది. ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. దీనికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నాడు.