Begin typing your search above and press return to search.

సమ్మర్‌ కు ఫిక్స్‌ అయిన సూపర్‌ స్టార్‌

By:  Tupaki Desk   |   3 Dec 2020 6:45 AM GMT
సమ్మర్‌ కు ఫిక్స్‌ అయిన సూపర్‌ స్టార్‌
X
కరోనా కారణంగా ఎన్నో సినిమాలు వాయిదా పడ్డాయి. ఈ ఏడాదిలో విడుదల అవుతాయనుకున్న సినిమాలు అన్ని కూడా వచ్చే ఏడాదికి షిప్ట్‌ అయ్యాయి. తమిళనాట అత్యధిక ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో అజిత్‌ ఒకరు అనడంలో సందేహం లేదు. ఆయన నటిస్తున్న 'వాలిమై' సినిమా కోసం ఆయన అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వినోద్‌ దర్శకత్వంలో ఈ సినిమాను బోనీ కపూర్‌ నిర్మిస్తున్నాడు. ఈ ఏడాదిలోనే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇటీవలే షూటింగ్‌ ను రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రారంభించారు. జనవరి చివరి వరకు షూటింగ్‌ ను పూర్తి చేయబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు.

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అజిత్‌ 'వాలిమై' సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌ కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకే సమయంలో డబ్బింగ్‌ చేసి విడుదల చేసే విషయమై ఆలోచిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా వంద కోట్లు వసూళ్లు చేస్తుందని అభిమానులు షూటింగ్‌ ప్రారంభం అయిన సమయంలో ఆశించారు. అయితే కరోనా పరిస్థితులతో 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా ఎంత వసూళ్లు చేస్తుంది అనేది చూడాలి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ హుమా కురేషి నటిస్తుండగా టాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తికేయ విలన్‌ గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.