Begin typing your search above and press return to search.

‘వాలిమై’ రూపంలో అజిత్.. ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేస్తోంది!

By:  Tupaki Desk   |   11 Feb 2021 8:30 AM GMT
‘వాలిమై’ రూపంలో అజిత్.. ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేస్తోంది!
X
ఇండ‌స్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా.. త‌మిళ‌నాట టాప్ స్టార్ గా ఎదిగాడు థ‌లా అజిత్‌. ఆయ‌న న‌ట‌న మొద‌లు.. హెయిర్ స్టైల్ వ‌ర‌కు అన్నీ ప్ర‌త్యేకమే. ఇవ‌న్నీ.. ఆయ‌న్ను స్పెష‌ల్ హీరోగా నిల‌బెట్టాయి. కోలీవుడ్ లో రజనీకాంత్, విజయ్ తరువాత అత్యధిక అభిమానులున్న‌ హీరో అజిత్. ఒక్క‌డిగా మొద‌లై.. స‌క్సెస్ ఫుల్ సినిమాల‌తో అగ్ర‌శ్రేణి హీరోగా ఎదిగాడు థ‌లా.

ఇక‌, తమిళ్ లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ను సెట్ చేసుకున్న అజిత్ సినిమాలు.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంటాయి. కొంత కాలంగా ఆయ‌న‌ సినిమాలు వంద కోట్లకు తక్కువ కాకుండా క‌లెక్ష‌న్లు రాబ‌డుతున్నాయంటే.. అజిత్ మార్కెట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఎలాంటి పాత్ర‌నైనా అవ‌లీల‌గా పోషించ‌గ‌లిగే ఈ వర్సెటైల్ యాక్ట‌ర్ మ‌రో కొత్త సినిమాతో రాబోతున్నాడు.

అజిత్ సినిమాల‌కు టాలీవుడ్ లో భారీస్థాయి మార్కెట్ లేదు. అయితే.. ఇప్పుడు సౌత్ ఇండ‌స్ట్రీల‌న్నీ పాన్ ఇండియన్ జ‌పం చేస్తుండ‌డంతో.. అజిత్ కూడా త‌న కొత్త సినిమాతో టాలీవుడ్లోనూ మార్కెట్ పెంచుకునేందుకు చూస్తున్నాడు. ఇలాంటి ప‌రిస్థితుల్లో వ‌స్తున్న అజిత్ మూవీ ‘వాలిమై’. సినిమాపై అప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ను.. పాన్ ఇండియన్ మూవీగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ‘వాలిమై’ ఫ‌స్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఫ్యాన్స్ ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. లేటెస్ట్ అప్డేట్ ప్ర‌కారం.. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ త్వ‌ర‌లో రిలీజ్ కాబోతోంది.

ఈ మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మార్చిలో రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ సిద్ధ‌మ‌వుతున్నార‌ని స‌మాచారం. మ‌రి, మార్చిలో ఏ డేట్ అన్న‌ది చూడాలి. కాగా.. ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ గా అజిత్ న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ‌ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా.. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.