Begin typing your search above and press return to search.

అజిత్ సినిమా బడ్జెట్ 120 కోట్లా?

By:  Tupaki Desk   |   26 Jun 2017 5:17 AM GMT
అజిత్ సినిమా బడ్జెట్ 120 కోట్లా?
X
గత కొన్నేళ్లలో సౌత్ ఇండియన్ సినిమాల రేంజే మారిపోయింది. బడ్జెట్లు పెరిగిపోయాయి.. బిజినెస్ రేంజి పెరిగింది.. కలెక్షన్లు కూడా అందుకు తగ్గట్లే పెరిగాయి. మార్కెట్ విస్తరించుకోవడంలో స్టార్ హీరోలు తెలివిగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో అయినా.. తమిళంలో అయినా స్టార్ హీరోలు సినిమాలేవీ కూడా రూ.70-80 కోట్ల బడ్జెట్‌ కు తగ్గట్లేదు. రీజనల్ సినిమాలకు వందల కోట్లలో బడ్జెట్లు పెట్టి కూడా రికవరీ చేయొచ్చని ‘బాహుబలి’ లాంటి సినిమాలు రుజువు చేశాయి. ఐతే మామూలు కమర్షియల్ సినిమాలకు మాత్రం బడ్జెట్ వంద కోట్లు దాటితే కష్టమే. కానీ అజిత్ కొత్త సినిమా ‘వివేగం’కు ఏకంగా రూ.120 కోట్లు పెట్టేస్తున్నారట. ‘బాహుబలి’ కాకుండా సౌత్ ఇండియాలో ప్రస్తుతానికి అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇదే అని చెప్పాలి.

‘వివేగం’లో విలన్ పాత్ర పోషిస్తున్న వివేక్ ఒబెరాయ్ ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి చెబుతూ.. బడ్జెట్ రూ.120 కోట్లన్నాడు. సినిమా చాలా రిచ్ గా తెరకెక్కుతోందని.. దీని కోసం తాను యూరప్ లో చాలా చాలా దేశాలు తిరిగానని అన్నాడు. హాలీవుడ్ ప్రమాణాలతో సినిమా తెరకెక్కుతున్నట్లు.. ఇందులో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ ఉన్నట్లు వివేక్ తెలిపాడు. ఇందులో చేస్తున్నది నెగెటివ్ రోలేనా అని అడిగితే.. పాజిటివా నెగెటివా చెప్పనని.. కానీ హీరోతో సమానమైన పాత్ర అని వెల్లడించాడు వివేక్. అజిత్ గత కొన్నేళ్లలో నటించిన సినిమాలన్నీ అటు ఇటుగా రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టాయి. ఐతే ‘వివేగం’ బడ్జెటే రూ.120 కోట్లంటున్నారు కాబట్టి ఆ సినిమా గ్రాస్ రూ.170-180 కోట్లు వస్తే తప్ప నిర్మాత.. బయ్యర్లు సేఫ్ అవ్వరన్నమాట. ఆగస్టు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/