Begin typing your search above and press return to search.
అప్పట్లో మెగాస్టార్ తో ఇప్పటి తలా స్టార్
By: Tupaki Desk | 5 Feb 2018 2:01 PM GMTకోలీవుడ్ లో రజనికాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉందని చెప్పుకునే తలా అజిత్ ఇమేజ్ మనవాళ్ళకు కూడా పరిచయమే. ఇక్కడ అంత బలమైన మార్కెట్ లేదు కాని అతనంటే ఇష్టపడే అభిమానులు తెలుగులో కూడా ఉన్నారు. సాధారణ మసాలా సినిమాలతో కూడా భారీ ఓపెనింగ్స్ తో పాటు అదిరిపోయే వసూళ్లు తెచ్చే ఇమేజ్ అజిత్ సొంతం. నిజానికి అజిత్ తెలుగులోనే తన హీరో ఎంట్రీ ఇచ్చాడు. 1992లో ప్రముఖ నటుడు - రచయిత గొల్లపూడి మారుతీరావు గారి అబ్బాయి గొల్లపూడి శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ప్రేమ పుస్తకం’ అనే సినిమా ద్వారా పరిచయమయ్యాడు. ఆ షూటింగ్ సగంలో ఉండగానే ప్రమాదవశాత్తు దర్శకుడు అకాల మరణం చెందటంతో గొల్లపూడి మారుతీరావుగారు సినిమా ఫినిష్ చేసి విడుదల చేసారు. అది ఫ్లాప్ అయ్యింది. కాంచన్ హీరొయిన్ గా పరిచయమైన ఆ మూవీ ఫీల్ గుడ్ లవ్ స్టొరీ గా రూపొందినప్పటికీ ప్రొడక్షన్ లో జరిగిన ఆలస్యం కారణంగా 1993లో విడుదలైంది.
పైన మీరు చూస్తున్న ఫోటో ఆ సినిమా ఓపెనింగ్ సందర్భంగా తీసుకున్నది. అప్పుడు అజిత్ వయసు 21. హీరోగా తనను తాను ఋజువు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ సినిమా విజయం సాధించి ఉంటే బహుశా అజిత్ ఇక్కడే సెటిల్ అయ్యేవాడేమో. అదే సంవత్సరం అమరావతి అనే తమిళ్ మూవీ కూడా చేసిన అజిత్ అది పర్వాలేదు అనే రేంజ్ లో హిట్ కావడంతో అక్కడే కుదురుకుని స్టార్ హీరోగా అందనంత ఎత్తుకి ఎదిగాడు. ఆ రోజు తన భుజం మీద చెయ్యి వేసిన మెగాస్టార్ రేంజ్ కి తాను కోలీవుడ్ లో చేరుకుంటానని అజిత్ ఆ రోజు ఊహించాడో లేదో.
ప్రేమ పుస్తకం సినిమా తర్వాత అజిత్ ఇంకా ఏ తెలుగు స్ట్రెయిట్ సినిమా చేయలేదు. మూడేళ్ళ తర్వాత ఆసై(తెలుగులో ‘ఆశ ఆశ ఆశ’)బ్రేక్ ఇచ్చాక ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం పడలేదు. ప్రేమ లేఖ సినిమా ద్వారా ఇక్కడ కూడా భారీ హిట్ అందుకున్న అజిత్ కు తెలుగు అంటే ప్రత్యేక అభిమానం.పైన ఫోటోలో అజిత్ వయసు 21 కాగా మెగాస్టార్ వయసు 36. ఘరానా మొగుడు - గ్యాంగ్ లీడర్ - రౌడీ అల్లుడు సక్సెస్ తో అప్పటికే పీక్స్ లో ఉన్నారు. అంతా కాలం మహిమ. చిరు ఇంకా స్వింగ్ లో ఉండగా అజిత్ ఎవరు టచ్ చేయలేని బలమైన మార్కెట్ ని సొంతం చేసుకున్నాడు. విచిత్రం ఏంటంటే గత దశాబ్దానికి పైగానే చిరు - అజిత్ ఒకే వేదికను షేర్ చేసుకునే సందర్భమే రాలేదు.