Begin typing your search above and press return to search.

పద్మావతి డైరెక్టర్ వాళ్లతో సమానం

By:  Tupaki Desk   |   17 Nov 2017 6:07 AM GMT
పద్మావతి డైరెక్టర్ వాళ్లతో సమానం
X
దీపికా పదుకొనే టైటిల్ రోల్ లో నటించగా.. షాహిద్ కపూర్.. రణవీర్ సింగ్ లు నటించిన మూవీ పద్మావతి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై ఇప్పుడు బోలెడన్ని వివాదాలు చుట్టుముట్టాయి. రాజ్ పుత్ కర్ణి సేన నుంచి అనేకమంది పద్మావతి మూవీని వ్యతిరేకిస్తున్నారు. రెండు వారాల తర్వాత ఈ చిత్రం ఏ థియేటర్లలోకి అయితే రానుందో.. వాటిపై ఇప్పుడే దాడులు చేసేస్తున్నారు.

ఇప్పుడు అజ్మీర్ దర్గా దీవాన్ అయిన జైనుల్ అబెదిన్ అలీ ఖాన్ కూడా.. పద్మావతికి వ్యతిరేకంగా తన గొంతు కలిపాడు. ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీని ఈయన కోరడం విశేషం. మతపరమైన సెంటిమెంట్స్ ను రెచ్చగొట్టే ఈ చిత్రాన్ని నిషేధించాలని కోరిన అబెదిన్.. 'వివాదాస్పద రచయితలు అయిన సల్మాన్ రష్దీ.. తస్లీమా నస్రీన్.. తారేక్ ఫతాహ్ లాంటి వాడే సంజయ్ లీలా భన్సాలీ కూడా. ముస్లింలు అందరూ ఈ చిత్రాన్ని వ్యతిరేకించాలి' అని డిమాండ్ చేశారు. వాక్ స్వాతంత్ర్యపు హక్కును ఉపయోగించుకుని.. ముస్లింలను రెచ్చగొట్టే రచనలు చేసిన మాదిరిగానే భన్సాలీ కూడా అని అభిప్రాయపడ్డారాయన.

సినిమా కోసం చరిత్రను వక్రీకరించారనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసిన అబెదిన్.. ఈ సినిమాలో ఎలాంటి వివాదాస్పద అంశాలు లేవనే విషయాన్ని ధృవీకరించుకున్న తర్వాత విడుదలకు ఆమోదించాలని.. ఏ సామాజిక వర్గాన్ని కించపరచలేదనే విషయం ముందుగా కన్ఫాం కావాలని డిమాండ్ చేశారు.