Begin typing your search above and press return to search.
MB26 నిర్మాతల మరో రెండు టైటిల్స్
By: Tupaki Desk | 9 Jun 2019 4:31 AM GMTటాలీవుడ్ లో ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత అనీల్ సుంకర ప్రస్థానం గురించి తెలిసిందే. మహేష్ హీరోగా నటించిన దూకుడు- ఆగడు చిత్రాల్ని కోప్రొడ్యూస్ చేశారు. బిందాస్- అహనా పెళ్లంట- కిట్టు ఉన్నాడు జాగ్రత్త లాంటి హిట్ సినిమాల్ని నిర్మించారు. అల్లరి నరేష్.. రాజ్ తరుణ్ వంటి యంగ్ హీరోలతో వరుసగా సినిమాల్ని నిర్మిస్తున్నారు. అలాగే భాగస్వామ్యంలో పలువురు అగ్ర హీరోల సినిమాల్ని నిర్మించేందుకు ప్రణాళికలు వేస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం చిన్నా- పెద్దా సినిమాలతో జోరు పెంచింది. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా నటిస్తున్న 26వ సినిమా `సరిలేరు నీకెవ్వరు` ప్రారంభమైంది. ఈ సినిమాని దిల్ రాజుతో కలిసి అనీల్ సుంకర అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఈ సినిమాతో పాటే మరో మూడు సినిమాల్ని ఏక కాలంలో నిర్మిస్తూ ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత దూకుడు పెంచడంపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న సినిమా 50శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమాకి `చాణక్య` అనే టైటిల్ ఖరారైందని తెలుస్తోంది. నేడు టైటిల్ ని అఫీషియల్ గా ప్రకటించనున్నారు. అలాగే అల్లరి నరేష్ హీరోగా నిర్మిస్తున్న చిత్రానికి `బంగారు బుల్లోడు` టైటిల్ ఖరారు చేశారు. అయితే గోపిచంద్ సినిమాకి బంగారు బుల్లోడు టైటిల్ ని ఎంపిక చేశారని ఇటీవల ప్రచారమైంది. దీంతో తమ సంస్థలో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలకు సంబంధించిన టైటిల్స్ విషయంలో క్లారిటీనిచ్చేందుకు ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత అనీల్ సుంకర సిద్ధమవుతున్నారు.
మహేష్.. గోపిచంద్.. అల్లరి నరేష్ సినిమాలతో పాటు డా.అబ్దుల్ కలాం అనే ఓ బయోపిక్ ని ఈ సంస్థ నిర్మిస్తోంది. అభిషేక్ అగర్వాల్ తో కలిసి అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికిప్పుడు నాలుగు సినిమాల్ని నిర్మిస్తూ అనీల్ సుంకర బిజీగా ఉన్నారు. మహేష్ .. గోపిచంద్ సినిమాలు భారీ బడ్జెట్లతో తెరకెక్కుతున్నవి. ఈ సినిమాల్ని అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా నిర్మించేందుకు ఏకే సంస్థ భారీ బడ్జెట్లు కుమ్మరిస్తూ పెద్ద స్థాయిలో ఎఫర్ట్ పెడుతోందని తెలుస్తోంది. ఇటీవలే కాజల్- బెల్లంకొండ శ్రీనివాస్ - తేజ కాంబినేషన్ లో తెరకెక్కించిన `సీత` ఆశించిన ఫలితాన్ని దక్కించుకోని సంగతి తెలిసిందే.