Begin typing your search above and press return to search.
పదహారేళ్లకే ప్రేమలో పడిపోయా
By: Tupaki Desk | 15 Dec 2017 1:22 PM GMTఈ ఏడాది మోడల్స్ అలాగే పరభాషా సీరియల్ భామలు - హీరోయిన్స్ చాలా మందే టాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఎంట్రీ అయితే బాగానే ఇచ్చారు కానీ అందరు అనుకున్నంతగా హిట్స్ అందుకోలేదు. దాదాపు స్టార్ హీరోయిన్స్ కూడా ఈ ఏడాది కొన్ని పరాజయాలను చూడక తప్పలేదు. అయితే కొంత మంది యువ కథానాయికలు మాత్రం నెక్స్ట్ టాలీవుడ్ లో బిజీ అయ్యేలా ఉన్నారు అనిపిస్తోంది.
సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా వారి అందంతో చాలా ఆకట్టుకుంటున్నారు. దీంతో బడా దర్శకనిర్మాతలు వారి వైపు చూస్తున్నారు. కుర్ర హీరోలు కూడా ఏరికోరి మరి ఎంచుకుంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. రీసెంట్ గా మళ్లీ రావా సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఆకాంక్ష సింగ్ కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారుతోంది. అమ్మడు మొన్నటి వరకు హిందీ సీరియల్స్ చేసి ఇప్పుడు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అయితే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ తన వ్యక్తిగత విషయాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల చెప్పింది. తాను టీనేజ్ లోనే ప్రేమలో పడ్డాను అని చెబుతూ.. 20 ఏళ్లకి ప్రేమించిన వ్యక్తినే వివాహం చేసుకున్నట్లు చెప్పింది. ఇప్పుడు ఆమె వయస్సు 27. అంతే కాకుండా తన భర్త సపోర్ట్ తోనే నటనలో శిక్షణను తీసుకొని హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చాను అంటూ.. కేవలం నాకు సెట్ అయ్యే కథలను మాత్రమే చేస్తానని ఆకాంక్ష సింగ్ వివరించింది.