Begin typing your search above and press return to search.
మా ఆస్తులన్నీ పోయాయని నాకు ఆలస్యంగా తెలిసింది: ఆకాశ్ పూరి
By: Tupaki Desk | 22 Jun 2022 2:30 AM GMTహీరోగా నిలదొక్కుకోవడానికి ఆకాశ్ పూరి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. 'మెహబూబా' .. 'రొమాంటిక్' సినిమాలతో యూత్ ను ఆకట్టుకున్న ఆకాశ్ పూరి, తన తాజా చిత్రమైన 'చోర్ బజార్' తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. జీవన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఈ నెల 24వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆకాశ్ పూరి బిజీగా ఉన్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.
ఇంతకుముందు సినిమాల్లో చిన్నపిల్లాడిలా కనిపించాననీ, ఈ సినిమాలో కాస్త హీరోలా కనిపిస్తున్నాని ఫ్రెండ్స్ అంటున్నారు. ఈ సినిమాలో కాస్త ఫిట్ గానే కనిపిస్తున్నానని నేను అనుకుంటున్నాను. ఇంతవరకూ లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ చేస్తూ వచ్చాను . ఇకపై ఫ్యామిలీ ఎంటర్టైనర్లు .. కామెడీ కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. నా సినిమాలకి సంబంధించిన కథలను నేనే వింటాను .. నేనే నిర్ణయం తీసుకుంటాను. నాన్నకు కావలసింది కూడా అదే.
ఎప్పుడూ కూడా నేను పూరి కొడుకుగా .. హీరోగా కథలు వినను. ఒక ఆడియన్ లానే కథను వింటాను .. నచ్చితే చేస్తాను .. లేదంటే లేదు. హీరోగా నాకు నేనుగా నిలబడాలని అనుకుంటున్నాను.
ఇక్కడ ఏ ఫాదర్ కూడా తన కొడుక్కి స్టార్ డమ్ ఇవ్వలేడు. ఎవరికీ వారు కష్టపడి స్టార్ డమ్ తెచ్చుకోవలసిందే. అలా నేను నా గోల్ చేరుకుని మా నాన్న పేరును నిలబెట్టాలని అనుకుంటున్నాను. ఒకానొక సమయంలో మా ఆస్తులన్నీ పోయాయి. ఆ విషయాలు మాకు తెలియకూడదని మా అమ్మ మమ్మల్ని హాస్టల్లో వేసింది.
మేము వేసుకునే బట్టల్లో .. తినే ఫుడ్డులో అన్నిటిలో తేడా వచ్చేసింది. మా కార్లు .. ఇళ్లు కూడా అమ్మేశారనే విషయం ఆలస్యంగా తెలిసింది. ఆ సమయంలో మా నాన్నకి మా అమ్మనే పెద్ద సపోర్టుగా నిలిచింది.
మొదటి నుంచి కూడా నాన్న చాలా స్ట్రాంగ్ .. అందువల్లనే ఆ పరిస్థితి నుంచి మళ్లీ ఆయన కోలుకున్నారు .. మళ్లీ ఎప్పటి పరిస్థితికి చేరుకున్నాము. ఆ సమయంలో మా అమ్మానాన్నలు విడాకులు తీసుకోనున్నారనే ప్రచారం జరిగిందని మీరు అంటున్నారు .. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదు" అంటూ చెప్పుకొచ్చాడు.