Begin typing your search above and press return to search.
జిమ్ లో పనికి చేరితే గుర్తుపట్టేశారు: ఆకాశ్ పూరి
By: Tupaki Desk | 9 Jun 2022 2:30 AM GMTపూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి హీరో కంటెంట్ ఉన్నవాడేనని నిరూపించుకున్నాడు. తన ఏజ్ కీ .. బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'చోర్ బజార్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమాకి జీవన్ రెడ్డి దర్శకత్వం వహించాడు. గెహెనా సిప్పీ కథానాయికగా నటించిన ఈ సినిమాకి సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆకాశ్ పాల్గొన్నాడు.
ఆ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో రన్ అవుతోంది. ఈ కార్యక్రమం ద్వారా అలీ అనేక విషయాలను రాబట్టినట్టుగా తెలుస్తోంది. అలీ అడిగిన ప్రశ్నలకి ఆకాశ్ సమాధానమిస్తూ .. "మొదటి నుంచి కూడా నాకు సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్. అందువలన ఆ విషయాన్ని నాన్నకి ఎప్పుడూ చెబుతూ ఉండేవాడిని. నాన్న సినిమాలకి సంబంధించిన డైలాగ్స్ ను బట్టీ పట్టి పొద్దున్నే నాన్న నిద్ర లేవగానే చెప్పేసేవాడిని. సినిమాలకి సంబంధించి నా ఫస్టు పారితోషికం ప్రకాశ్ రాజ్ గారి నుంచి తీసుకున్నాను. అంత గొప్ప నటుడు నుంచి ఫస్టు పారితోషికం తీసుకోవడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను.
నాన్నకి ఖాళీగా ఉండటం అస్సలు నచ్చదు .. నన్ను కూడా ఆయన ఖాళీగా ఉంచలేదు. ఒక రోజున నన్ను పిలిచి 'ఇంట్లో ఇలా ఖాళీగా ఉండొద్దు .. వెళ్లి ఏదైనా పని చూసుకో' అన్నారు. దాంతో నేను వెళ్లి జిమ్ క్లీన్ చేసే పని చూసుకున్నాను. ఆర్థికపరమైన సమస్యల కారణంగా ఆ పనిలో చేరుతున్నట్టుగా చెప్పాను. అయితే ఆ జిమ్ అతను నన్ను గుర్తు పట్టేశాడు. 'నువ్వు పూరి గారి అబ్బాయివా? అని అడిగితే .. కాదనే చెప్పాను. కానీ జిమ్ లోని కొంతమంది అక్కడికి వచ్చి నేను పూరి కొడుకునని అతనితో చెప్పారు.
నా చిన్నప్పుడు హెయిర్ కి జెల్ పెట్టుకోవడమంటే ఇష్టం. ఆ జెల్ ను చరణ్ గారి దగ్గర చూసి అది పెట్టుకోవచ్చా అని అడిగాను. దాంతో ఆయన 'నీకు ఏ స్టైల్ కావాలో చెప్పారా' అని నా దగ్గర చైర్ వేసుకుని రకరకాల హెయిర్ స్టైల్స్ సెట్ చేశారు. ఇక అదే సమయంలో అలీ సూపర్ మార్కెట్ ప్రస్తావన తీసుకుని వచ్చాడు. చిన్నప్పుడు తాను ఒక సినిమా సీడీని దొంగతనం చేసినట్టుగా ఆకాశ్ చెప్పాడు. 'అంటే అప్పటి నుంచే తమరు 'చోర్ బజార్' స్టార్ట్ చేశారన్నమాట' అంటూ అలీ నవ్వించాడు. సరదాగా .. సందడిగా సాగిన ఈ ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది.