Begin typing your search above and press return to search.
నాన్న ఆలోచనలకి భిన్నంగా ఆకాష్ పూరి!
By: Tupaki Desk | 23 Jun 2022 5:30 PM GMTడ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పూరి మ్యూజింగ్స్ పేరుతో వల్లించే జీవిత సత్యాల గురించి తెలిసిందే. ఇప్పటికే దాదాపు మనిషి జీవితం..జీవిన విధానం గురించి చాలా వాయిస్ లు తన యూ ట్యూబ్ ఛానల్ లో పొందు పరిచారు. జీవితం ఎలా ఉండాలి? ఎలా ఉండ కూడదు? ఎలా బ్రతకాలి? బ్రతికినంత కాలం ఎలా బ్రతకాలి? అన్న దానిపై కూడా చాలా వివరంగానే చెప్పే ప్రయత్నం చేసారు.
యువత జీవితం గురించి అయితే ఇంకా ఎంతో ఇంపాక్ట్ గా చెప్పారనొచ్చు. ''జీవితం అంటే పెళ్లి పెళ్లాం..పిల్లలు కాదు. ప్రపంచాన్ని చుడటం. తాను చేసిన అతి తెలివి తక్కువ పని పెళ్లి చేసుకోవడం. ఆ రోజు నాకు తెలియలేదు. అప్పుడే ఇన్ని విషయాలు తెలిసి ఉంటే కచ్చితంగా పెళ్లి చేసుకునే వాడిని కాదు'' అన్నారు.
''అందుకే ప్రపంచాన్ని చూడాలనుకున్నా..నీ జీవితం నీ చేతుల్లో ఉండాలన్నా పెళ్లి చేసుకోవద్దు. ఏవైనా గోల్స్ ఉంటే వాటినే టార్గెట్ చేయండి. నలుగురిలో బ్రతకాలా? నలుగురిలో ఒక్కడిగా నిలబడాలా? అన్నది నీ చేతుల్లోనే ఉంటుంది. దాన్ని పెళ్లి బంధంతో ముడి పెట్టి నాశనం చేసుకోవద్దు'' అని కాస్త గట్టిగానే చెప్పారు.
అయితే ఇక్కడ క్వశ్చన్? పూరి తనయుడు ఆకాష్ కూడా తండ్రిలాగే ఆలోచిస్తాడా? తండ్రికి భిన్నంగా కనిపిస్తాడా? లేక డివైడ్ గా ఉండాలనుకుంటాడా? అంటే ఆకాశ్ ఇటీవల ఓ వేదికపై చేసిన మాటల్లో కామన్ మ్యాన్ కనిపిస్తున్నాడు. తనకి కొన్ని బరువు బాధ్యతలు ఉన్నాయన్నాడు. చెల్లి పవిత్ర కి పెళ్లి చేయాలన్నాడు...తాను పెళ్లి చేసుకుని ఓ అమ్మాయిని ఇంటికి కోడలిగా తీసుకురావాలన్నాడు.
తన తండ్రితో పాటు తాను తీసుకోవాల్సిన బాధ్యతలు ఇవన్నీ అంటూ చెప్పుకొచ్చాడు. ఆకాష్ మాటల్ని బట్టి పూరి తనయుడు తను కోరుకున్న విధంగా ఉండడని తెలుస్తుంది. పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేసి వర్షం పడితే ఇంట్లో కూర్చని టీవీ చూస్తూ..పెళ్లాంతో గారెలు వడ్డించుకుని తినే టైప్ అని తెలుస్తోంది.
నిజమే ఆకాష్ పూర్తిగా తల్లి చాటు బిడ్డ అని చాలా సందర్భాల్లో రివీల్ అయింది. పిల్లలు బాధ్యతలు మొత్తం తల్లి లావణ్యనే చూసుకుంటారు. కోట్ల రూపాయలు ఆస్తులన్నా..ఖరీదైన జీవితం ముందున్నా చాలా సాధారణంగా బ్రతకడానికే ఆ కుటుంబం ఇష్ట పడుతుంది. తండ్రిలా ఎదగలనుకుంటున్నాడు ఆకాష్. అదే కసి పట్టుదల ఆకాష్ లోనూ కనిపిస్తుంది. కానీ అదే తండ్రిని అన్ని విషయాల్లో అనుసరించకూడదు అని బలంగానే సంకల్పించాడు అని తెలుస్తుంది.