Begin typing your search above and press return to search.

AMBలో రొమాంటిక్ ప్రీమియ‌ర్.. రోజు ముందే రిజ‌ల్ట్!

By:  Tupaki Desk   |   25 Oct 2021 5:36 AM GMT
AMBలో రొమాంటిక్ ప్రీమియ‌ర్.. రోజు ముందే రిజ‌ల్ట్!
X
ఆకాష్ పూరి క‌థానాయ‌కుడిగా అనీల్ పాడూరి ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కిన `రొమాంటిక్` చిత్రంపై ప్రీరిలీజ్ వేదిక సాక్షిగా అంచ‌నాలు పెంచేసిన సంగ‌తి తెలిసిందే. వ‌రంగ‌ల్ వేదిక‌గా జ‌రిగిన ప్రీ ఈవెంట్ లో ఆకాష్ త‌న‌దైన స్పీచ్ తో క‌ట్టి ప‌డేశాడు. `కొట్టాడ్రా మ‌వాడాడు` అని పూరి గ‌ర్వంగా చెప్పుకునేలా ఈ మూవీ హిస్ట‌రీలో నిలిచిపోతుంద‌ని ధీమా వ్య‌క్తం చేసాడు. ఈ ఒక్క మాట‌తో రొమాంటిక్ పై అంచ‌నాలు పీక్స్ కు చేరుకున్నాయి. ఓ వైపు తండ్రి ప్ర‌తిభను చాటి చెబుతూనే మ‌రోవైపు సినిమా గురించి ఆద్యంతం ఆక‌ట్టుకునే లా మాట్లాడాడు ఆకాశ్. ఇప్ప‌టికే ట్రైల‌ర్ యూత్ లో దూసుకుపోతుంది.

యువ‌తరం టార్గెట్ గా సినిమా ఆద్యంతం ఆక‌ట్టుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. పూరినే స్వ‌యంగా క‌థ‌.. క‌థ‌నం.. మాట‌లు అందించ‌డం సినిమాకు పెద్ద అస్సెట్ గా క‌నిపిస్తున్నాయి. అనీల్ మేకింగ్ లోనూ పూరీ మార్క్ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మ‌రి ప్రేక్ష‌కులను ఏస్థాయిలో మెప్పిస్తుందో తెలియాలంటే అక్టోబ‌ర్ 29 వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే. అయితే రిలీజ్ కి రెండు రోజుల ముందుగానే హైద‌రాబాద్ లోని ఏఎంబీ మాల్ లో సినీ ప్ర‌ముఖుల‌కు.. మీడియాకి ప్రీమియ‌ర్ షో వేస్తున్నారు. దీంతో సినిమా టాక్ ఏంట‌న్న‌ది ఈనెల‌ 27నే తెలిసిపోయే అవ‌కాశం ఉంది. అయితే ఇక్క‌డ మీడియాకి ముందుగా వేయ‌డం అన్న‌దే స‌వాల్ విసిరినట్లుగా ఉంది.

మీడియాకి ముందుగానే సినిమా చూపించ‌డం అంటే గ‌ట్స్ ఉండాలి. ఆకాష్ మాట‌ల్లో ఆ ధీమా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అయితే సినిమాకు ఏమాత్రం డివైడ్ టాక్ వ‌చ్చినా ఆ ఫ‌లితం రిలీజ్ పై ప‌డుతుంది. రివ్యూలు చూసి సినిమాకు వెళుతున్న రోజులు కాబ‌ట్టి `రొమాంటిక్` వాటిని అధిగ‌మించాల్సి ఉంటుంది. మ‌రి ఆకాష్ పూరి ఇచ్చిన మాట‌ను ఎంత వ‌ర‌కూ నిల‌బెట్టుకుంటాడో చూద్దాం.

ఆకాష్ న‌టుడిగా ఫెయిల్ కాడు!

ఆకాష్ న‌టించిన తొలి సినిమా ఫెయిలైనా న‌టుడిగా అత‌డు ఫెయిల్ కాలేద‌న్న ప్ర‌శంస‌లు కురిసాయి. మొద‌టి సినిమా `మెహ‌బూబా` ఫ్లాపైనా న‌టుడిగా మంచి మార్కులే వేయించుకున్నాడు. డాడీలానే ఆకాష్ డ్యాషింగ్ స్టైల్ ఉన్న న‌టుడు.. హీరోగా ఎదిగేందుకు ఆస్కారం ఉంది! అంటూ క్రిటిక్స్ ప్ర‌శంసించారు. కానీ ఆ త‌ర్వాత రెండో సినిమా రొమాంటిక్ ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఆల‌స్య‌మైంది. రొమాంటిక్ షూటింగ్ పూర్త‌యినా రిలీజ్ విష‌యంలో ఎందుక‌నో డైల‌మా కొన‌సాగింది.. ఇటీవ‌ల లాక్ డౌన్ క్రైసిస్ వ‌ల్ల వాయిదా ప‌డింది. ఇప్పుడు థియేట‌ర్లు తెరిచారు కాబ‌ట్టి స‌స్పెన్స్ వీడింది. క‌థాంశం మ్యాట‌ర్ కి వ‌స్తే.. మాఫియా నేప‌థ్యంలో ప్రేమ‌కథా చిత్ర‌మిది. యాక్ష‌న్ ఆక‌ట్టుకుంటుంద‌ట‌. కేతిక శ‌ర్మ ఈ చిత్రంతో క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అవుతోంది. ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌ను పోషించారు. హిందీ నటుడు మకరంద్ దేశ్ పాండే ఒక ముఖ్య పాత్రలో న‌టించారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్-, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌- ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.