Begin typing your search above and press return to search.
'ఆకాశవాణి' ఫస్ట్ సింగిల్: ఆదివాసీలు పాడుకునే పాట 'మన కోన'
By: Tupaki Desk | 19 April 2021 3:35 PM GMTదర్శకధీరుడు రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు తెరకెక్కిస్తోన్న చిత్రం ''ఆకాశవాణి''. ఇందులో విలక్షణ నటుడు సముద్రఖని - వినయ్ వర్మ - తేజ కాకుమాను - ప్రశాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏయూ అండ్ ఐ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఎ.పద్మనాభరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ మంచి స్పందన తెచ్చుకోవడమే కాకుండా సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో చిత్రంలోని 'మన కోన' అనే పాట లిరికల్ వీడియోను నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు.
'కొయ్యాహే కొయ్యాహే.. కొమ్మలనే అమ్మలనే కోయనై..' అంటూ సాగే ఈ గీతానికి కాల భైరవ స్వరాలు సమకూర్చారు. అడవిలో జీవించే ఆదివాసీల నేపథ్యాన్ని తెలియజేసేలా లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు. జానపద గాయని మంగ్లీ - కాల భైరవ కలిసి ఈ పాటను ఆలపించారు. సినిమా మూడ్ కి తగ్గట్టు ఉన్న ఈ సాంగ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. విభిన్నమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న 'ఆకాశవాణి' చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నారు.