Begin typing your search above and press return to search.

12 కు 19... నైజాంలో అఖండ బ్లాక్ బస్టర్‌

By:  Tupaki Desk   |   5 Jan 2022 6:36 AM GMT
12 కు 19... నైజాంలో అఖండ బ్లాక్ బస్టర్‌
X
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమా విడుదల అయ్యి నాలుగు వారాలు పూర్తి అయ్యి అయిద వారం నడుస్తోంది. ఇప్పటికి కూడా కొన్ని థియేటర్లలో మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. అఖండ సినిమా తర్వాత పుష్ప మరియు శ్యామ్‌ సింగ రాయ్ సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఆ సినిమాలు భారీగానే వసూళ్లు దక్కించుకుంటున్నాయి. అయినా కూడా అఖండ సినిమా వసూళ్ల విషయంలో తగ్గలేదు. ఈ సినిమా నైజాం ఏరియాలో రికార్డును నమోదు చేసింది. బాలయ్య తన ఆల్ టైమ్ రికార్డును నమోదు చేశాడు. బాలయ్య సినిమా అంటే నైజాం.. ఆంద్రా లోనే ఆడుతాయి అంటూ ఒక వర్గం వారు చేసే విమర్శలకు ఈ నెంబర్స్ సమాధానం అనడంలో సందేహం లేదు.

సింహా మరియు లెజెండ్‌ వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత బాలయ్య బోయపాటి కాంబో సినిమా అనగానే అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమా సూపర్ హిట్‌ టాక్ దక్కించుకోవడంతో నైజాం ఏరియాలో భారీ వసూళ్లను నమోదు చేసింది. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం అఖండ సినిమా నైజాం ఏరియాలో 12 కోట్ల రూపాయల షేర్‌ టార్గెట్‌ తో బరిలోకి దిగింది. అంతకు ముందు బాలయ్య సినిమాలు అయిదు ఆరు కోట్ల షేర్‌ ను మాత్రమే రాబట్టాయి. కొన్ని సినిమాలు ఆమాత్రం కూడా దక్కించుకోలేక పోయాయి. హిట్ టాక్ దక్కించుకున్నా కూడా పది కోట్ల షేర్‌ వరకే రాబట్టే అవకాశం ఉందంటూ విడుదల ముందు కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాని వారు అనుకున్న దానికి దాదాపుగా డబుల్‌ ఈ సినిమా రాబట్టింది. 12 కోట్ల బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ తో విడుదల అయిన అఖండ సినిమా లాంగ్ రన్ లో ఏకంగా 19 కోట్ల రూపాయల షేర్‌ ను నమోదు చేసింది.

నిర్మాతతో పాటు ఈ సినిమాను నైజాం ఏరియాలో పంపిణీ చేసిన బయ్యర్లకు లాభాల వర్షం అనడంలో సందేహం లేదు. నైజాం ఏరియాలో ఇప్పటి వరకు బాలయ్య నటించిన ఏ ఒక్క సినిమా కూడా ఈ స్థాయిలో వసూళ్లను దక్కించుకున్న దాఖలాలు లేవు. 19 కోట్ల షేర్‌ అంటే మామూలు విషయం కాదు. బయ్యర్‌ కు మరియు నిర్మాతకు ఒక్క నైజాం ఏరియాలోనే రికార్డు స్థాయి లాభాలు దక్కినట్లుగా టాక్‌ వినిపిస్తుంది. బాలయ్య కు నైజాం ఏరియాలో ఉన్న ఫాలోయింగ్‌ కు ఇదే నిదర్శనం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో కూడా మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. అయితే అక్కడ టికెట్ల రేట్లు మరీ తక్కువగా ఉండటం వల్ల ఆల్ టైమ్ రికార్డును బాలయ్య దక్కించుకోలేక పోయాడు అనేది టాక్‌. అక్కడ పరిస్థితి పక్కన పెడితే ఓవర్సీస్‌ లో మిలియన్ డాలర్లు.. నైజాం లో 19 కోట్ల షేర్‌ తో అఖండ సినిమా టైటిల్ కు తగ్గట్లుగా భారీ విజయాన్ని నమోదు చేసింది అంటూ మేకర్స్ హ్యాపీగా ఉన్నారు.