Begin typing your search above and press return to search.
‘అఖండ’ అదిరే కలెక్షన్లు.. 4 రోజుల గ్రాస్ లెక్క మామూలుగా లేదుగా?
By: Tupaki Desk | 6 Dec 2021 4:33 AM GMTకరోనా వేళ కుదేలైన బాక్సాఫీస్ కు పూనకాలు తెప్పించి.. కలెక్షన్ల వరద పారిస్తోంది బాలయ్య తాజా చిత్రం ‘అఖండ’. ఓవైపు రియాల్టీ షోలు.. మరోవైపు ఓటీటీలతో సినిమా పరిశ్రమ ఉక్కిరిబిక్కిరి అవుతూ.. థియేటర్లు కళకళలాడేది ఎప్పుడున్న మాటకు ఆన్సర్ వచ్చేసింది. ఏమైనా.. పెద్ద హీరోల సినిమాలే సినిమాలు.
వారు నటించిన సినిమా విడుదలైతే చాలు.. ప్రేక్షకులు ప్రతికూలతల్ని పక్కన పెట్టేసి.. థియేటర్లకు ఎగబడతారన్న విషయం అఖండ మూవీతో అందరికి అర్థమయ్యేలా చేసింది.
తెలుగు చిత్ర పరిశ్రమకు ఉత్తేజాన్నిచ్చే టానిక్ లా మారింది అఖండ విజయం. చిత్ర దర్శక నిర్మాతలు సైతం ఇంతటి ఘన విజయాన్ని అంచనా వేయలేదన్న మాట ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఈ సినిమా ఇంతటి విజయాన్ని ఎలా సాధించింది? ఎందుకు సాధించిందన్న ప్రశ్నలకు సమాధానాల్ని చూసే ప్రయత్నం జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించిన విశ్లేషణలు ఇప్పటికే కొన్ని వచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన పెద్ద హీరో సినిమా కావటం.. మాస్ చిత్రం కావటం లాంటివి అందరి నోటి నుంచి వినిపిస్తున్నా.. అంతకు మించిన కారణాలు ఉన్నాయన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.
ఈ మూవీలోని అఖండ పాత్రే సినిమా రేంజ్ ను మార్చేయటంతో పాటు.. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఊపిరిపీల్చుకోనివ్వని రీతిలో చేసిందని చెప్పాలి. అన్నింటికి మించి.. దర్శకుడు రాసుకున్న కథలో.. అఖండ శివుడి అంశ అన్న విషయాన్ని బలంగా చెప్పటంతో పాటు.. అతడికున్న శక్తుల్ని ముందు ఒకటికి రెండుసార్లు చెప్పటంతో.. లాజిక్కుల చట్రంలో చిక్కుకోకుండా చేసి.. సూపర్ హీరో ఏమైనా చేసేయొచ్చన్న కన్వీన్స్ సినిమాకు ప్లస్ అయ్యిందని చప్పాలి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. హిందూమతం గొప్పతనం గురించి.. దేవాలయాల ప్రాధాన్యత గురించి వివరించిన వైనం కూడా అందరిని ఆకట్టుకునేలా చేసిందన్న మాట వినిపిస్తోంది. ఒక సినిమా సక్సెస్ అయినప్పుడు అన్ని మంచి శకునములే అన్న రీతిలో అఖండకు అన్ని అంశాలు కలిసి వచ్చాయి. ఇక..కలెక్షన్ల విషయానికి వస్తే.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదలైన మూడు రోజుల్లో 63 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేయగా.. నాలుగో రోజు కూడా మొదటి మూడు రోజుల సందడిని కంటిన్యూ చేసిందని చెప్పాలి. దీంతో.. గ్రాస్85 కోట్ల మార్కును దాటేసిందన్న లెక్కలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ ఏపీలో కానీ బెనిఫిట్ షోలు.. ఐదారు ఆటలకు ఓకే చెప్పి.. పాత టికెట్ ధరలు కానీ ఉండి ఉంటే కచ్ఛితంగా రూ.100 కోట్ల మార్కు ఈపాటికి క్రాస్ చేసేదని చెబుతున్నారు.
అయినప్పటికీ ఇప్పటికే ఈ సినిమాకు జరిగిన నష్టం లేదని.. సినిమా బాగుందన్న టాక్ అంతకంతకూ స్ప్రెడ్ అవుతున్న వైనంతో.. హిట్ సినిమాల్ని మాత్రమే థియేటర్లలో చూసేందుకు ఇష్టపడే వర్గం కూడా సినిమాకు వచ్చేయటం.. అఖండకు మరిన్ని కలెక్షన్లను తీసుకొచ్చి పెడుతోంది.
తాజా కలెక్షన్లతో ఇప్పటివరకు బాలయ్య సినిమా కలెక్షన్లను అఖండ క్రాస్ చేయటమే కాదు.. సరికొత్త రికార్డుల దిశగా పరుగులు తీస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా. అఖండ విజయం తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త ఊపుతో పాటు.. ఈ నెలలో విడుదలయ్యే అల్లు అర్జున పుష్ప (డిసెంబరు 17).. ఆ తర్వాత విడుదలయ్యే శ్యామ్ సింగరాయ్ (డిసెంబరు 24)లు మాత్రమే కాదు.. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ కు మంచి శకునాన్ని అఖండ ఇచ్చిందని చెప్పాలి.