Begin typing your search above and press return to search.

అన్నిచోట్లా లెక్క స‌రిచేసిన `అఖండ‌`

By:  Tupaki Desk   |   6 Dec 2021 5:29 AM GMT
అన్నిచోట్లా లెక్క స‌రిచేసిన `అఖండ‌`
X
న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాల‌కు ఏపీలో ఎదురే ఉండ‌ద‌న్న సంగ‌తి తెలిసిందే. ఉత్త‌రాంధ్ర‌.. రాయ‌ల‌సీమ జిల్లాల్లో బాల‌య్య బ్రాండ్ ఇమేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. బాల‌య్య బ్రాండ్ తోనే సినిమా మార్కెట్ అయిపోతుంది. మంచి టాక్ వ‌స్తే అదే బ్రాండ్ తో బాక్సాఫీస్ ని షేక్ చేస్తారు. అయితే నైజాం లెక్క వేరే.

ఏపీలో భారీ వ‌సూళ్లు సాధించిన సినిమా కూడా నైజాంలో కొద్దిపాటి వ‌సూళ్ల‌తోనే స‌రిపెడుతుంది. బాల‌య్య ఇమేజ్ ఆ ప్రాంతంలో అంత‌గా ఇంపాక్ట్ చూపించద‌ని ఓ విమ‌ర్శ ఉంది. అయితే ఇప్పుడా లెక్క‌ల‌న్నింటిని `అఖండ` స‌రిచేసింది. నైజాం నుంచి `అఖండ‌`కు అనూహ్య స్పంద‌న ల‌భించింది.

ఆ లెక్క ఏ రేంజ్ లో వ‌ర్క‌వుటైందంటే తొలి వారంలోనే ఆ ప్రాంతం వ‌సూళ్ల‌తో బ్రేక్ ఈవెన్ సాధించింది. నైజాంలో `అఖండ` థియేట్రికల్ రైట్స్ 10.5 కోట్లకు అమ్ముడుపోయింది. కాగా `అఖండ ` తొలి రోజు వ‌సూళ్లే 6.6 కోట్లు గ్రాస్.. 4.4 కోట్లు షేర్ సాధించింది. శుక్ర‌..శ‌నివారాల్లో 4.5 కోట్లు షేర్ తెచ్చిపెట్టింది.

మొత్తంగా మూడు రోజుల్లో నైజాం షేర్ 9.1 కోట్లు కాగా ఆదివారం హౌస్ ఫుల్ తో ర‌న్ అయింది. కరీంన‌గ‌ర్..వ‌రంగ‌ల్ లాంటి వీక్ ఏరియాల్లో సైతం `అఖండ` వ‌సూళ్ల మోత మ్రోగించింది.

ఆంధ్రా..రాయ‌ల‌సీమ జిల్లాలో మెజార్టీ థియేట‌ర్లో రిలీజ్ చేసినా రెండు రోజుల గ్యాప్ అనంత‌రం మ‌ళ్లీ కొత్త సినిమాల‌కు థియేట‌ర్లు క్లియ‌ర్ చేయాల్సి వ‌చ్చింది. రిలీజ్ త‌ర్వాత ఆ సినిమాల‌కు స‌రైన టాక్ రాక‌పోవ‌డంతో `అఖండ‌`కు థియేట‌ర్లు పెంచారు. ఆ కార‌ణంగా వ‌సూళ్ల‌పై కొంత ప్ర‌భావం ప‌డింది. నైజాంలో కూడా అదే ప‌రిస్థితి.

అయితే తాజాగా థియేట‌ర్లు పెంచిన నేప‌థ్యంలో వ‌సూళ్లు పెరిగే అవ‌కాశం క‌నిపిస్తుంది. ఈ చిత్రానికి బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిగా ద్వార‌కా క్రియేష‌న్స్ ప‌తాకంపై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మించారు.