Begin typing your search above and press return to search.
మిలియన్ క్లబ్ లో చేరిన అఖండ
By: Tupaki Desk | 14 Dec 2021 4:42 AM GMTబాలకృష్ణ.. బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ సినిమా వారికి హ్యాట్రిక్ ను ఇచ్చింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత తెలుగులో నమోదు అయిన అతి పెద్ద విజయంగా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఇప్పటికే సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. యూఎస్ లో నందమూరి అభిమానులు ప్రీమియర్ తో రికార్డు సృష్టించారు.
ఈ ఏడాదిలో టాప్ చిత్రంగా అఖండ అక్కడ ఇక్కడ నిలిచింది అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. కరోనా కు ముందు యూఎస్ లో తెలుగు సినిమా లు మిలియన్ మార్క్ ను చాలా ఈజీగా చేరుకునేవి. కాని ఇప్పుడు పరిస్థితి అలా లేదు. అక్కడ మిలియన్ డాలర్లను వసూళ్లు చేసింది అంటే అదో పెద్ద అద్బుత విజయం అన్నట్లుగా పరిస్థితి మారింది.
అఖండ సినిమా యూఎస్ లో మిలియన్ మార్క్ కు చేరుతుందా అంటూ విశ్లేషకులు కాస్త అనుమానం వ్యక్తం చేశారు. కాని ఓపెనింగ్స్ భారీగా నమోదు అవ్వడంతో పాటు పెద్ద ఎత్తున అక్కడ వసూళ్లు నమోదు అవ్వడంతో మిలియన్ మార్క్ ను టచ్ చేసింది. అక్కడ అఖండ సినిమా కు అత్యధిక స్క్రీన్స్ దక్కాయి. రెండవ వీకెండ్ లో కూడా మంచి వసూళ్లు నమోదు అయ్యాయి.
దాంతో రెండవ ఆది వారం పూర్తి అయ్యేప్పటికి అఖండ సినిమా కు అక్కడ మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదు అయ్యాయి అంటూ సమాచారం అందుతోంది. యూఎస్ లో ఈ ఏడాది మిలియన్ డాలర్లను దక్కించుకున్న అతి కొన్ని సినిమాల జాబితాలో అఖండ చేరినందుకు నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బాలకృష్ణ మరియు బోయపాటి కాంబోలో మూడు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో నాల్గవ సినిమా కూడా తెరకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరి కాంబోలో నాల్గవ సినిమా మరీ ఎక్కువ రోజులు వెయిట్ చేయకుండానే రావచ్చు అంటున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ వారు వీరి కాంబో నాల్గవ సినిమాను నిర్మించే యోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.
ఇప్పటికే బాలయ్య మరియు బోయపాటిలకు సితార వారు అడ్వాన్స్ లు ఇచ్చారనే వార్తలు వస్తున్నాయి. ఇద్దరు కూడా ఇతర ప్రాజెక్ట్ లను కమిట్ అయ్యారు. వారి వారి కమిట్ మెంట్స్ ను పూర్తి చేయాలంటే 2023 వరకు వెయిట్ చేయాల్సి రావచ్చు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వీరిద్దరి కాంబో మరో అఖండ 2024 కి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.