Begin typing your search above and press return to search.

అఖండ మరో 'కోటి' రికార్డ్‌

By:  Tupaki Desk   |   24 Jan 2022 3:15 AM GMT
అఖండ మరో కోటి రికార్డ్‌
X
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. సినిమా ఏకంగా 50 రోజులు పూర్తి చేసుకోవడం తో పాటు ఏకంగా 200 కోట్ల వసూళ్లను దక్కించుకున్నట్లుగా ఇటీవలే చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. బాలయ్య మూవీ అఖండ ఈ స్థాయిలో వసూళ్లు దక్కించుకోవడంతో నందమూరి అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. సినిమా ను ఓటీటీ లో స్ట్రీమింగ్‌ చేస్తున్నా కూడా ఇతర పెద్ద సినిమాలు విడుదలకు లేక పోవడంతో ఇంకా కొన్ని థియేటర్లలో అఖండ ను ప్రదర్శిస్తున్నారు. దాంతో ఇంకా వసూళ్లు నమోదు అవుతూనే ఉన్నాయి.

తాజాగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్ లో అరుదైన రికార్డు ను అఖండ నమోదు చేసింది. బ్లాక్ బస్టర్ సినిమాలకు మాత్రమే దక్కే అరుదైన ఆర్టీసీ క్రాస్ రోడ్‌ కోటి వసూళ్లను అఖండ సినిమా దక్కించుకుంది. తాజాగా అఖండ సినిమా అక్కడ కోటి రూపాయల వసూళ్లను పూర్తి చేసిందని యూనిట్‌ వర్గాల వారు ప్రకటించారు. రికార్డు బ్రేకింగ్ వసూళ్లు నమోదు చేసిన అఖండ మరో వైపు ఓటీటీ లో కూడా అత్యధికంగా చూస్తున్న సినిమా గా నిలిచింది. అఖండ సినిమా మరియు శ్యామ్‌ సింగ రాయ్‌ లు రెండు ఒకే రోజు స్ట్రీమింగ్‌ అయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా ఓటీటీ వేదిక మీద పోటీ పడి మరీ వ్యూస్ ను దక్కించుకుంటున్నట్లుగా ఓటీటీ విశ్లేషకుల ద్వారా సమాచారం అందుతోంది. బాలయ్య కెరీర్‌ కు ఇదో బిగ్‌ బూస్టర్ అనడంలో సందేహం లేదు.

అఖండ సినిమా లో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు. అఘోరా పాత్రలో బాలయ్య అల్లాడించాడు. హింస కాస్త ఎక్కువ అయ్యింది అంటూ విమర్శలు వచ్చినా కూడా హిందూ ధర్మం ను కాపాడే సన్నివేశాలు మరియు చెడుపై మంచి చేసే యుద్ధం వంటి సన్నివేశాలు సినిమా స్థాయిని పెంచాయి. బాలయ్య ను ఎలా చూపిస్తే ప్రేక్షకులు ఆధరిస్తారు అనే విషయాన్ని బోయపాటి పసిగట్టాడు. అందుకే బాలయ్య ను ఇంత అద్బుతంగా చూపించాడంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌ గా నటించిన ఈ సినిమా లో కీలక పాత్రలో పూర్ణ నటించగా శ్రీకాంత్‌ విలన్ గా నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమా ముందు ముందు మరెన్ని రికార్డులను నమోదు చేస్తుందో చూడాలి. ఈ సినిమా దక్కించుకున్న ఘన విజయంతో బోయపాటి ఖచ్చితంగా అఖండ 2 చిత్రాన్ని చేస్తానంటూ ప్రకటించాడు.