Begin typing your search above and press return to search.
బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్న 'అఖండ'
By: Tupaki Desk | 27 Sep 2021 3:30 AM GMTనందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ సినిమా దసరాకు ఖచ్చితంగా వస్తుందని అభిమానులతో పాటు అంతా వెయిట్ చేశారు. థియేటర్ లు కూడా పూర్తి స్థాయిలో ఓపెన్ అయ్యాయి.. అలాగే ఇటీవల విడుదల అయిన సినిమాలు కూడా మంచి వసూళ్లను దక్కించుకుంటున్నాయి. పైగా దసరాకు పెద్ద సినిమాలు ఏమీ కూడా విడుదలకు లేవు. కనుక అఖండ సినిమాను దసరాకు విడుదల చేయడం అంత ఉత్తమం మరేమీ లేదు అంటూ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. కాని బాలకృష్ణ అఖండ సినిమా దసరాకు విడుదల చేయడం లేదని దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. దసరాకు విడుదల చేయాలంటే ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటించి ప్రమోషన్ కార్యక్రమాలు కూడా షురూ చేయాలి. కాని ఇప్పటి వరకు షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టలేదు.
ఈ నెల చివరి వరకు షూటింగ్ పూర్తి అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సరే ఈ నెల చివరి వరకు సినిమా పూర్తి అయినా కూడా దసరాకు విడుదల చేయడం సాధ్యమే. కాని ఇప్పటి వరకు విడుదల తేదీ ప్రకటించలేదు కనుక ఖచ్చితంగా సినిమా విడుదల విషయంలో అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దసరాకు కాకుండా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. సంక్రాంతికి ఇప్పటికే సర్కారు వారి పాట.. రాధే శ్యామ్ మరియు భీమ్లా నాయక్ సినిమాలు కన్ఫర్మ్ అయ్యి. ఈ మూడు సినిమాలు కూడా టాలీవుడ్ స్టార్ హీరోలవే అనే విషయం తెల్సిందే. అయినా కూడా ఈ మూడు సినిమాలో మరి కొన్ని సినిమాలు కూడా పోటీ పడేందుకు సిద్దం అవుతున్నాయి. కనుక సంక్రాంతికి ఖచ్చితంగా అయిదు ఆరు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం కన్ఫర్మ్ అయ్యింది. ఇంత పోటీలో కూడా అఖండ సినిమా ను సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారట.
ఇప్పటికే వచ్చే ఏడాది సంక్రాంతి నెల జనవరి 12.. 13.. 14 తేదీలు భీమ్లా నాయక్.. సర్కారు వారి పాట మరియు రాధే శ్యామ్ సినిమా లకు బుక్ అయ్యాయి. ఈ మూడు తేదీల్లో ఒక తేదీని అఖండ ఫిక్స్ చేసుకుంటాడా లేదంటే కొత్త తేదీలో సినిమాను విడుదల చేస్తాడా అనేది చూడాలి. మొత్తానికి బాలకృష్ణ సెంటిమెంట్ తో తన అఖండ సినిమాను సంక్రాంతికి తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. సంక్రాంతి సందర్బంగా సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా గుమ్మడి కాయ కొట్టిన రోజు ప్రకటిస్తారని యూనిట్ సభ్యుల నుండి సమాచారం అందుతోంది. సంక్రాంతికే కనుక ఈ సినిమా విడుదల అయితే ఖచ్చితంగా పోటీ తీవ్రంగా ఉంటుంది. అంతటి పోటీని బాలయ్య ఎలా ఎదుర్కొంటాడా అంటూ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.