Begin typing your search above and press return to search.
క్రిటిక్స్ పెదవి విరిచేసినా ఇంత పెద్ద హిట్లు ఎలా?
By: Tupaki Desk | 3 Jan 2022 4:11 AM GMTఆ రెండు సినిమాల ప్రివ్యూలు వీక్షించాక క్రిటిక్స్ పెదవి విరిచేశారు. ఏవో కొన్ని కమర్షియల్ అంశాలు తప్ప కంటెంట్ పరంగా ఏమంత మ్యాటర్ లేదని విమర్శించారు. కానీ ఆ రెండు సినిమాలు అనూహ్యంగా పెద్ద విజయాల్ని నమోదు చేసాయి. ఇంత క్రైసిస్ లోనూ రికార్డుల్ని బ్రేక్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి.
డిసెంబర్ లో వారం గ్యాప్ తో విడుదలైన అఖండ- పుష్ప సినిమాలు జనవరిలోనూ అద్భుత వసూళ్లను సాధిస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఓవైపు ఒమిక్రాన్ భయాలు అంతకంతకు పెరుగుతున్నా మెట్రోల్లో 50 శాతం ఆక్యుపెన్సీ నియమాలు ఉన్నా కానీ.. ఈ రెండు చిత్రాలు స్థిరంగా వసూళ్లను సాధిస్తుండడం ఆశ్చర్యపరుస్తోంది. ట్రేడ్ వర్గాల ప్రకారం.. శని- ఆదివారాల్లో అఖండ బి- సి సెంటర్లలో భారీ వసూళ్లను సాధించింది. చాలా థియేటర్లు హౌస్ ఫుల్స్ అయ్యాయి. ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన కలెక్షన్లను సాధించింది. ఇంకా వారాంతాల్లో ఈ చిత్రానికి భారీ వసూళ్లు కురుస్తున్నాయి. అఖండ బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా 80 కోట్లకు పైగా షేర్ సాధించింది. బాలకృష్ణకు తొలి 100కోట్ల గ్రాస్ క్లబ్ చిత్రంగా రికార్డులకెక్కింది.
పుష్ప విషయానికి వస్తే.. అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఇరుగు పొరుగు భాషల్లో అనూహ్య విజయం అందుకుంది. అమెరికాలోనూ సత్తా చాటింది. హిందీ వెర్షన్ వసూళ్లు ఎలా ఉంటాయోనని భావించినా కానీ.. ఉత్తరాదిన షాకింగ్ వసూళ్లను సాధిస్తోంది. జనవరి 1న అద్భుతమైన అత్యధిక సింగిల్ డే కలెక్షన్ లతో, ఈ చిత్రం ఇప్పుడు బాలీవుడ్ లో 57 కోట్ల గ్రాస్ కు దగ్గరగా ఉంది. నిజానికి మొదట ఈ చిత్రం గరిష్టంగా 25 కోట్లు పైగా వసూలు చేస్తుందని భావిస్తే అందుకు డబుల్ వసూలు చేసింది. ఈ చిత్రం కేవలం హిందీ రంగం నుండి రూ. 75 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని అంచనా. పుష్ప ఇటీవలే 300 కోట్ల క్లబ్ లో చేరింది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సూర్యవంశీని సైతం వెనక్కి నెట్టి 2021లో భారతదేశపు అతిపెద్ద వసూళ్లను సాధించింది. నిజానికి ఇలాంటి క్రైసిస్ లో అంత గొప్ప ఫీట్ సాధించడం అన్నది అసాధారణం. ఎన్బీకేకి అఖండ.. అల్లు అర్జున్ కి పుష్ప కెరీర్ లో ఎన్నటికీ మరువలేనివిగా రికార్డులకెక్కాయి.