Begin typing your search above and press return to search.
'అఖండ' కు పోటీగా ఓటీటీలోకి వస్తోన్న 'శ్యామ్ సింగరాయ్'..!
By: Tupaki Desk | 8 Jan 2022 11:30 AM GMTనేచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించిన చిత్రం ''శ్యామ్ సింగరాయ్''. ఇందులో సాయి పల్లవి - కృతి శెట్టి హీరోయిన్లుగా నటించగా మడోన్నా సెబాస్టియన్ - రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలు పోషించారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్ళు రాబట్టింది. తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో థియేటర్లలో సందడి చేసిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్.. ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి రెడీ అవుతోంది.
'శ్యామ్ సింగరాయ్' సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ రేటుకు కొనుగోలు చేసింది. అయితే ఓటీటీ దిగ్గజం ఈ సినిమా ప్రీమియర్స్ జనవరి 21న ప్రదర్శించబోతున్నట్లు సమాచారం. సంక్రాంతికి థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడానికి మేకర్స్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అయిన ఆరు వారాలకు డిజిటల్ వేదికల మీదకు వస్తుంటాయి. కానీ ఇప్పుడు 'పుష్ప' వంటి పెద్ద సినిమాలను మూడు వారాల కంటే ముందే ఓటీటీలో స్ట్రీమింగ్ చేశారు. ఈ క్రమంలో ''శ్యామ్ సింగరాయ్'' చిత్రాన్ని కూడా నెల తిరగక ముందే డిజిటల్ స్క్రీన్ మీదకు రాబోతోంది. నెట్ ఫ్లిక్స్ లో తెలుగుతో పాటుగా మిగతా దక్షిణాది భాషల్లో ఈ సినిమాని ప్రేక్షకులకు అందుబాటులో ఉంచుతారని సమాచారం.
ఇకపోతే జనవరి 21న హాట్ స్టార్ ఓటీటీలో 'అఖండ' సినిమా ప్రీమియర్ గా రానుంది. దీనికి పోటీగా అదే రోజు 'శ్యామ్ సింగరాయ్' సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. 'వి' 'టక్ జగదీష్' వంటి రెండు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేసిన నాని.. ఈసారి ఎన్ని అవతారాలు వచ్చినా థియేట్రికల్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో థియేటర్లలో తీసుకొచ్చి నాలుగు వారాల్లో ఓటీటీలో వదలబోతున్నారు. మరి థియేటర్లలో ఆకట్టుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.
కాగా, 'శ్యామ్ సింగరాయ్' చిత్రంలో నాని రెండు పాత్రల్లో అద్భుతమైన నటన కనబరిచారు. సత్యదేవ్ జంగా ఈ సినిమాకి కథ అందించగా.. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చారు. సాను జాన్ వర్గేష్ సినిమాటోగ్రఫీ అందించగా.. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు.