Begin typing your search above and press return to search.

రిస్క్‌ లేకుండా మిస్టర్‌ మజ్ను ప్లానింగ్స్‌

By:  Tupaki Desk   |   18 Sept 2018 11:39 AM IST
రిస్క్‌ లేకుండా మిస్టర్‌ మజ్ను ప్లానింగ్స్‌
X
అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ మొదటి రెండు చిత్రాలతో ప్రేక్షకులను మరియు నిర్మాతలను సంతృప్తి పర్చడంలో విఫలం అయ్యాడు. హలో చిత్రంకు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా నాని సినిమాతో పోటీ కారణంగా కలెక్షన్స్‌ కాస్త తగ్గాయి. అఖిల్‌ ప్రస్తుతం తన మూడవ సినిమా వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. వరుణ్‌ తేజ్‌ తో ‘తొలిప్రేమ’ చిత్రాన్ని తెరకెక్కించి విభిన్న దర్శకుడిగా పేరు సంపాదించిన వెంకీ అట్లూరి తాజాగా ఈ చిత్రంతో అఖిల్‌ కు ఒక మంచి రొమాంటిక్‌ సక్సెస్‌ ను అందిస్తాడనే నమ్మకం అక్కినేని ఫ్యాన్స్‌ లో ఉంది.

ఈ చిత్రానికి ‘మిస్టర్‌ మజ్ను’ అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నట్లుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా ఈ చిత్రంకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ అయిన తర్వాత టైటిల్‌ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రంను డిసెంబర్‌ 21న విడుదల చేయాలని మొదటి నుండి భావిస్తూ వస్తున్నారు. అయితే అదే తేదీకి పలు చిత్రాలు విడుదల కాబోతున్న కారణంగా సినిమాను వాయిదా వేయాలని అక్కినేని క్యాంప్‌ నిర్ణయించుకున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

హలో చిత్రం సరైన సమయంలో విడుదల చేయకపోవడం వల్ల కలెక్షన్స్‌ తగ్గాయని - అందుకే ఈసారి సేఫ్‌ జోన్‌ లో రావాలనే ఉద్దేశ్యంతో అఖిల్‌ ఉన్నాడట. నాగార్జున ఆలోచన మేరకు సంక్రాంతి సీజన్‌ ముగిసిన తర్వాత రిపబ్లిక్‌ డే సందర్బంగా అంటే జనవరి 26 లేదా ఒక్క రోజు అటు ఇటుగా సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లుగా ఫిల్మ్‌ సర్కిల్స్‌ లో చర్చ జరుగుతుంది. ఈ సంవత్సరం రిపబ్లిక్‌ డేకు వచ్చిన చిత్రాలు మంచి వసూళ్లను సాధించాయి. అందుకే అఖిల్‌ 3 ను కూడా రిపబ్లిక్‌ డేకు తీసుకు రావాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రంలో అఖిల్‌ కు జోడీగా నిధి అగర్వాల్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.