Begin typing your search above and press return to search.

ఏజెంట్ .. `పాన్ ఇండియా` కాదంటున్న అఖిల్

By:  Tupaki Desk   |   16 Oct 2021 2:40 PM GMT
ఏజెంట్ .. `పాన్ ఇండియా` కాదంటున్న అఖిల్
X
గూఢ‌చ‌ర్యం నేప‌థ్యంలో సినిమా అంటే క‌థాంశంలో క‌చ్ఛితంగా యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉంటుంద‌ని భావిస్తారు. విజువ‌ల్ గ్రాండియారిటీతో ఈ త‌ర‌హా స్పై సినిమాల్ని తెర‌కెక్కించేందుకు ఆస్కారం ఉంటుంది. భారీత‌నం యాక్ష‌న్ ఛేజ్ ల‌తో ఇవి అల‌రిస్తాయి. ఇక హాలీవుడ్ లో జేమ్స్ బాండ్ 007 - బార్న్ ఐడెంటిటీ స‌హా ప‌లు క్రేజీ ఫ్రాంఛైజీలు సంచ‌ల‌న విజ‌యాలు సాధించ‌డ‌మే గాక విజువ‌ల్ గ్రాండియారిటీతో మ‌తులు చెడ‌గొట్టాయి.

ఇంత‌కుముందు అడివి శేష్ న‌టించిన గూఢ‌చారి బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. చాలా గ్యాప్ త‌ర్వాత స్పై కాన్సెప్టుతో వ‌చ్చిన సిస‌లైన చిత్రంగా గూఢ‌చారి రికార్డుల‌కెక్క‌డ‌మే గాక శేష్ కి మంచి పేరు తెచ్చింది. అందుకే ఇప్పుడు అక్కినేని అఖిల్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఏజెంట్ పై అంద‌రి క‌ళ్లు ఉన్నాయి. ఏజెంట్ కి రేసుగుర్రం ఫేం సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండడం మ‌రో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా మారింది. సైరా లాంటి పాన్ ఇండియా చిత్రాన్ని తెర‌కెక్కించిన సురేంద‌ర్ రెడ్డి ఏజెంట్ ని అంతే ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీ కోసం అఖిల్ లుక్ ని అత‌డు అమాంతం మార్చేసాడు. ఇక‌పోతే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ అంటూ ఇటీవ‌ల ప్ర‌చారం సాగుతోంది. కానీ అఖిల్ దానికి కౌంట‌ర్ ఇచ్చారు. ఏజెంట్ పాన్ ఇండియా చిత్రం కాద‌ని తాజాగా వెల్ల‌డించారు. అంటే ఈ సినిమాని తెలుగు-త‌మిళ భాష‌ల్ని టార్గెట్ చేస్తూ రూపొందిస్తున్నార‌ని భావించాల్సి ఉంటుంది.

ఏపీ పోర్టుల్లో `ఏజెంట్` చిత్రీక‌ర‌ణ‌..!

అఖిల్ `ఏజెంట్` అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఏజెంట్ లో అఖిల్ లుక్ ఇప్ప‌టికే సినిమాకి కావాల్సినంత ప్ర‌చారాన్ని తెచ్చి పెట్టింది. సిక్స్ ప్యాక్ లో అఖిల్ లుక్ ఆక‌ట్టుకుంది. ఇదొక స్పై థ్రిల్ల‌ర్ అని ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉంది. వైజాగ్ పోర్టులో వెలుగు చూసిన‌ హానీట్రాప్ నేప‌థ్యం ఎంచుకున్నార‌ని మ‌రోవైపు జోరుగా ప్ర‌చారం సాగుతోంది. అయితే ఈ సినిమా మొద‌టి షెడ్యూల్ నెల్లూరు జిల్లాలోని కృష్ణ‌ప‌ట్నం పోర్టులోనే జ‌రిగింది. ఇక ఇటీవ‌లే మ‌రో షెడ్యూల్ వైజాగ్ పోర్టులోనూ ప్లాన్ చేసారు.

వైజాగ్ షెడ్యూల్ కూడా ఇప్ప‌టికే పూర్త‌యింది. షూట్ లో భాగంగా ఏజెంట్ టీమ్ విశాఖ కోస్ట‌ల్ బెల్ట్ మొత్తం చుట్టేసిన‌ట్లు ప్ర‌చారంలో ఉంది. ఇక హైద‌రాబాద్ లోనూ కొంత షూటింగ్ చేసారు. తాజాగా యూనిట్ విదేశాల‌కు ప‌య‌నం అవుతున్న‌ట్లు స‌మాచారం. యూరప్ లోని బుడాఫెస్ట్ లో కీల‌క షెడ్యూల్ ప్లాన్ చేసారు. ప్ర‌స్తుతం షూటింగ్ బుడాఫెస్ట్ లోనూ జ‌రుగుతుంద‌ని స‌మాచారం. అక్క‌డి షెడ్యూల్ పూర్తి చేసిన అనంత‌రం యూనిట్ తిరుగు ప్ర‌యాణమ‌వుతుంది. అక్క‌డ నుంచి య‌థావిధిగా హైద‌రాబాద్ లో బ్యాలెన్స్ షూటింగ్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం 40కోట్ల‌కు పైగానే వెచ్చించిన‌ట్లు స‌మాచారం.

అఖిల్ కి స్థాయికి మించినా.. స్టార్ మేక‌ర్ సురేంద‌ర్ రెడ్డి పై ఉన్న న‌మ్మ‌కంతోనే నిర్మాత‌లు భారీ బ‌డ్జెట్ల‌తో ధైర్యంగా ముందుకు వెళ్తున్న‌ట్లు తెలుస్తోంది. అఖిల్ కెరీర్ లో ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క పెద్ద హిట్ కూడా లేదు. ప్ర‌స్తుతం బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్` విడుద‌లై క్రిటిక్స్ ప్ర‌శంస‌లు ద‌క్కించుకోవ‌డం ఏజెంట్ కి ప్ల‌స్ కానుంది. ఈ సినిమాపై అఖిల్ చాలా ఆశ‌లే పెట్టుకున్నందుకు అతడి కెరీర్ లో తొలి విజ‌యం న‌మోదైన‌ట్టేన‌ని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ గా అఖిల్ న‌ట‌న‌కు చ‌క్క‌ని ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. ఇందులో అఖిల్ లుక్ కూడా చాలా స్మార్ట్ గా క‌నిపించింది. అఖిల్ - హ‌లో - మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రాల‌తో ఫ్లాప్ లు చ‌వి చూసిన అఖిల్ కి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ పై పాజిటివ్ టాక్ రావ‌డం కొంత రిలీజ్ అనే చెప్పాలి. ఇదే హుషారులో ఏజెంట్ గా అద‌ర‌గొడ‌తాడ‌నే భావిద్దాం.