Begin typing your search above and press return to search.
అఖిల్ టీమ్ ఆ విషయంలో వెనక్కి తగ్గుతోందా?
By: Tupaki Desk | 7 Nov 2022 11:30 PM GMT2023 సంక్రాంతికి పలు క్రేజీ సినిమాలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. చాలా వరకు సినిమాలు ఇప్పటికే సంక్రాంతి వార్ కు సై అంటూ ప్రకటించేశాయి కూడా. ఇందులో ముందుగా ప్రభాస్ నటిస్తున్న తొలి మైథలాజికల్ మూవీ `ఆది పురుష్` సంక్రాంతి బరిలో జనవరి 12న దింపేస్తున్నామంటూ ప్రకటించేశారు. ఐదు భాషల్లో రిలీజ్ కానున్న సినిమా కాడం, ప్రభాస్ నటించిన తొలి మైథలాజికల్ డ్రామా కావడంతో ఈ మూవీ సంక్రాంతి బరిలో బిగ్ పోటీని ఇవ్వడం ఖాయం అని అంతా అనుకున్నారు.
ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్ ని జూన్ 16కు వాయిదా వేస్తున్నామంటూ చిత్ర బృందం ప్రకటించి షాకిచ్చింది. ఈ మూవీ వీఎఫ్ ఎక్స్ పై వస్తున్న విమర్శల నేపథ్యంలో చిత్ర బృందం మళ్లీ రీ వర్క్ చేయడానికి రెడీ అయిపోయింది. ఇందు కోసం రూ. 100 కోట్లు కేటాయించి వీఎఫ్ ఎక్స్ ని మరింత పక్కాగా సిద్దం చేయబోతోంది. ఆ కారణంగానే `ఆది పురుష్` రిలీజ్ ని వాయిదా వేసిందని తెలుస్తోంది.
ఇదిలా వుంటే సంక్రాంతి రేసు నుంచి `ఆది పురుష్` తరువాత మరో సినిమా కూడా తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. అక్కినేని అఖిల్ నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ `ఏజెంట్`. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అనిల్ సుంకర ఈ మూవీని నిర్మిస్తున్నారు. మమ్ముట్టి కీలక అతిథి పాత్రలో నటిస్తున్న ఈ మూవీని ఫైనల్ గా సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుతం సంక్రాంతికి నెలకొన్న పోటీని దృష్టిలో పెట్టుకుని సోలోగా రావడమే బెటర్ అని భావించిన మేకర్స్ `ఏజెంట్` సంక్రాంతి రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
సంక్రాంతి రేసులో సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీరయ్య`తో, నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి`తో బరిలో దిగబోతున్నారు. ఈ రెండు మాస్ బొమ్మల మధ్య దిగడం రిస్క్ అని భావించిన `ఏజెంట్` టీమ్ తమ సినిమాని మహా శివరాత్రికి రిలీజ్ చేయాలనుకుంటున్నారట. థియేటర్ల విషయంలోనూ ఇబ్బంది ఎదురయ్యే ప్రమాదం వుందన్న ఆలోచనలో భాగంగానే `ఏజెంట్` ని సంక్రాంతి రేస్ నుంచి తప్పించాలని ఆలోచిస్తున్నారట.
చిరంజీవి `వాల్తేరు వీరయ్య`, నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి`తో పాటు సంక్రాంతి రేసులో తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా పోటీకి దిగుతున్నాయి. విజయ్ హీరోగా నటిస్తున్న `వారసుడు`, అజిత్ నటిస్తున్న `తునీవు` రిలీజ్ కాబోతున్నాయి. దీంతో చాలా వరకు సినిమయాలకు థియేటర్ల సమస్య తలెత్తే అవకాశం వుంది. ఆ కారణంగానే `ఏజెంట్` ని సంక్రాంతి రేస్ నుంచి తప్పించాలనుకుంటున్నారట. ఇది మంచి నిర్ణయమేనని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.