Begin typing your search above and press return to search.
అఖిల్ 'ఏజెంట్' తగ్గేదేలే
By: Tupaki Desk | 4 July 2021 12:30 AM GMTఅక్కినేని ప్రిన్స్ అఖిల్ హీరో ప్రస్తుతం రూపొందుతున్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. కరోనా కారణంగా ఆ సినిమా విడుదల ఆలస్యం అవుతోంది. ఇదే సమయంలో అఖిల సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా ను మొదలు పెట్టారు. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఏజెంట్ టైటిల్ తో రూపొందబోతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. స్టైలిష్ సినిమాలకు పెట్టింది పేరు అయిన సురేందర్ రెడ్డి ఈ సినిమా ను పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందించేందుకు స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఇక ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి కూడా నటీ నటుల గురించిన వార్తలు సోషల్ మీడియాలో ప్రముఖంగా వస్తూనే ఉన్నాయి.
మొదట ఈ సినిమా లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఆయన స్థానంలో మమ్ముటీ నటించబోతున్నట్లుగా తాజాగా వార్తలు వస్తున్నాయి. మోహన్ లాల్ నటించాల్సి ఉన్నా కూడా డేట్ల క్లాష్ కారణంగా మమ్ముటీని ఈ సినిమాలో నటింపజేయాలనే నిర్ణయానికి వచ్చారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో మమ్ముట్టీ నటించేందుకు గాను ఏకంగా మూడు కోట్ల పారితోషికంను ఇవ్వబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది.
సినిమాలో అత్యంత కీలకమైన పాత్రను మమ్ముట్టీ చేస్తున్నాడని.. హీరోకు చాలా సపోర్టింగ్ రోల్ లో ఆయన ఈ సినిమాలో కనిపిస్తాడని అందుకే ఈ సినిమా కోసం ఆయనకు భారీ మొత్తంలో పారితోషికంగా ఇవ్వబోతున్నట్లుగా చెబుతున్నారు. కేవలం మమ్ముట్టీ పారితోషికం విషయంలోనే కాకుండా సినిమా మేకింగ్ విషయంలో కూడా తగ్గేదేలే అన్నట్లుగా సురేందర్ రెడ్డి ఖర్చు పెడుతున్నాడని సమాచారం అందుతోంది. అఖిల్ కమర్షియల్ సక్సెస్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తో వారికి ఈ సినిమా ఫుల్ సంతృప్తిని కలిగిస్తుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.