Begin typing your search above and press return to search.
'ఏజెంట్' ఒటీటీ.. ఇది పరిస్థితి
By: Tupaki Desk | 9 July 2023 1:57 PM GMTఅక్కినేని యువ హీరో అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేసిన ఏజెంట్ మూవీ ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో అందరికి తెలిసిందే. అనిల్ సుంకర ఈ చిత్రంతో కెరియర్ లో భారీ నష్టాన్ని చవిచూశారు. అఖిల్ నటించిన మొదటి మూవీ అఖిల్ కంటే ఏజెంట్ అతిపెద్ద డిజాస్టర్ అని చెప్పాలి. ఈ మూవీ ఫెయిల్యూర్ నిర్మాత అనిల్ సుంకరని భాగా డిస్టర్బ్ చేసింది.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మరోసారి ఏజెంట్ ఫెయిల్యూర్ తర్వాత తాను ట్వీట్ చేయడానికి కారణాలు చెప్పారు. స్క్రిప్ట్ లేకుండా సినిమా చేయడం వలన తాను ఎంత నష్టపోయానో అందరికి తెలియాలని, మరొకరు తనలా దెబ్బతినకూడదు అని ట్వీట్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని సోనీ లీవ్ ఛానల్ తీసుకుంది.
మే 19న రిలీజ్ చేయనున్నట్లు ఎనౌన్స్ చేశారు. ఎందుకనో తరువాత స్ట్రీమింగ్ వాయిదా పడింది. రెండు, మూడు సార్లు రిలీజ్ డేట్ చెప్పి మరి స్ట్రీమింగ్ ఆపేశారు. దీనిపై నిర్మాత అనిల్ సుంకర క్లారిటీ ఇచ్చారు. ఒటీటీ స్ట్రీమింగ్ కి సంబంధించి ఎలాంటి అడ్డంకులు లేవని, చానల్ అంతర్గత సంబంధమైన విషయాల కారణంగా మూవీ లేట్ అవుతుందని చెప్పారు.
ఇదిలా ఉంటే తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఏజెంట్ మూవీ సోనీ లీవ్ స్ట్రీమింగ్ శాశ్వతంగా ఆగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని భావించి ఆపేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటున్నారు. అయితే చాలా డిజాస్టర్ సినిమాలు ఒటీటీలో రిలీజ్ అవుతున్నాయి.
కాని ఏజెంట్ సినిమా మాత్రం ప్రేక్షకుల ముందుకి రావడం లేదు. మొత్తానికి అఖిల్ కి ఏజెంట్ మూవీ సిల్వర్ స్క్రీన్ మీదనే కాకుండా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ఛానల్స్ లో కూడా ఊహించని పరాభవం మిగిల్చింది అని చెప్పొచ్చు. సురేందర్ రెడ్డి లాంటి స్టార్ దర్శకుడి నుంచి వచ్చి డిజిటల్ స్ట్రీమింగ్ కి కూడా నోచుకోలేకపోయిన సినిమాగా ఏజెంట్ మూవీ చరిత్రలో నిలిచిపోతుందేమో చూడాలి.