Begin typing your search above and press return to search.
'ఏజెంట్' పర్‌ఫెక్ట్ ప్లాన్‌తో వస్తున్నాడు
By: Tupaki Desk | 12 March 2022 12:30 AM GMTవరుస డిజప్పాయింట్‌మెంట్స్ తర్వాత ఎట్టకేలకి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'తో హిట్టు కొట్టాడు అఖిల్ అక్కినేని. పర్‌ఫార్మెన్స్ పరంగా కూడా ఎదిగాడని అనిపించుకున్నాడు. ఈసారి తనని మరింత మ్యాన్‌లీగా చూపించి, తన ఇమేజ్‌ని పూర్తిగా మార్చే బాధ్యతను తలకెత్తుకున్నాడు సురేందర్‌రెడ్డి. 'ఏజెంట్' మూవీని టాలీవుడ్ బెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు కాంప్రమైజ్ కాకుండా కష్టపడుతున్నాడు.
వక్కంతం వంశీ అందించిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. సురేందర్‌రెడ్డి, రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. అఖిల్‌తో పాటు టీమ్ అంతా పాల్గొంటున్నారు. మమ్ముట్టి కూడా ఇటీవలే జాయినయ్యారు. ఇంతలోనే ఈ సినిమాకి రిలీజ్ డేట్‌ని ఖరారు చేశారు. ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
ఈ ముహూర్తం అఖిల్‌కి కలిసొచ్చేదే. ఎందుకంటే ఇది కాస్త పేట్రియాట్రిక్ టచ్ ఉన్న సినిమా. అఖిల్ అండర్ కవర్ ఏజెంట్‌గా నటిస్తున్నాడు. మమ్ముట్టి కూడా అదే తరహా పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి ఇండిపెండెన్స్ డే సీజన్‌లో విడుదల చేయడం కరెక్ట్. పైగా శుక్రవారం సినిమా విడుదల. ఆ తర్వాతి రోజు సెకెండ్ శాటర్‌డే. ఆపైన ఆదివారం. సోమవారం ఆగస్ట్ 15 సెలవు. కాబట్టి టికెట్లు బాగానే తెగుతాయి.
ఇక మరో విశేషమేమిటంటే.. ఈ సినిమా విడుదలకి ముందు రోజే 'లాల్‌సింగ్ చద్ధా' రిలీజ్ అవుతోంది. ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నాగచైతన్య ఓ ముఖ్య పాత్ర పోషించాడు. అయితే లాల్‌సింగ్ చద్ధాని ఏయే భాషల్లో విడుదల చేస్తున్నాడో ఆమిర్ ఇంత వరకు చెప్పలేదు. కాకపోతే నాగచైతన్య ఉన్నాడు కాబట్టి కచ్చితంగా సౌత్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేసే చాన్స్ ఉంది. అదే జరిగితే బాక్సాఫీస్ దగ్గర అన్నదమ్ములిద్దరికీ పోటీ ఖాయమే.