Begin typing your search above and press return to search.
అఖిల్ ఏజెంట్ టార్గెట్ -X లీక్ లు
By: Tupaki Desk | 20 Sep 2022 4:15 AM GMTటాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తన వారసుడు అఖిల్ ని బాలీవుడ్ లో బిగ్ రేంజులో లాంచ్ చేయాలని అనుకుంటున్నారా? అంటే అవుననే తాజా పరిణామాలు చెబుతున్నాయి. పెద్ద కుమారుడు అక్కినేని నాగచైతన్య ఇటీవలే అమీర్ తో కలిసి లాల్ సింగ్ చడ్డాలో నటించాడు. కానీ చైతన్యకు హిందీ డెబ్యూ షాకింగ్ రిజల్ట్ గా మారింది. కానీ అలాంటి తప్పిదం అఖిల్ విషయంలో చేయకూడదని నాగార్జున భావిస్తున్నట్టు తెలుస్తోంది.
నిజానికి ఏజెంట్ కథాంశాన్ని సురేందర్ రెడ్డి పలుమార్లు రీరైట్ చేయడానికి ఇందులో యాక్షన్ సీక్వెన్సులను రీడిజైన్ చేయడానికి కారణం లేకపోలేదు. ఏజెంట్ ని కేవలం తెలుగు-తమిళ ఆడియెన్ కే పరిమితం చేయకుండా హిందీ మార్కెట్లో పెద్ద స్థాయిలో రిలీజ్ చేయాలన్న ఆలోచనతోనే ఇవన్నీ చేశారు. బడ్జెట్ కూడా అమాంతం పెరిగింది. ఏజెంట్ ని హిందీ బెల్ట్ లో భారీగా రిలీజ్ చేయడానికి అవసరమైన ఏర్పాటు కరణ్ జోహార్ అండ్ టీమ్ చేస్తున్నారు. నాగ్ ఇటీవలే ముంబైలోని కరణ్ జోహార్ ఆఫీసులో కనిపించారు. తాను నటించిన బ్రహ్మాస్త్రను ప్రమోట్ చేసారు. ఇంతలోనే నాగ్ తన కుమారుడు అఖిల్ హిందీ అరంగేట్రానికి సంబంధించి ముంబైలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కరణ్ జోహార్ త్వరలో అఖిల్ ని హిందీలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని దాని కోసం ప్లాన్స్ జరుగుతున్నాయని హిందీ మీడియాలో గాసిప్ ఉంది.
ఏజెంట్ చిత్రాన్ని హిందీలో ఘనంగా విడుదల చేయడమే గాక.. స్ట్రెయిట్ గా కరణ్ బ్యానర్ లోనే అఖిల్ తదుపరి మూవీ చేయబోతున్నాడని కూడా భావిస్తున్నారు. వరుసగా హిందీ చిత్రాల్లో నటిస్తూ బాక్సాఫీస్ రేంజును విస్తరించే ఆలోచనలో అఖిల్ ఉన్నాడు. అక్కినేని కాంపౌండ్ లో మనం తర్వాత మళ్లీ చెప్పుకోదగ్గ రేంజు సినిమా లేదు. అన్ని లోపాలను సరిచేస్తూ అఖిల్ రయ్ మని దూసుకొస్తాడనే అంతా ఆశిస్తున్నారు. ఏజెంట్ తో అతడు చాలా ప్రశ్నలకు సమాధానం చెబుతాడనే భావిస్తున్నారు.
దసరా లేదా క్రిస్మస్ రిలీజ్?
'ఏజెంట్' ని పాన్ ఇండియా కేటగిరీలో హిందీ-తెలుగు-తమిళం-మలయాళం-కన్నడలో అత్యంత భారీగా విడుదల చేస్తామని ఇంతకుముందే టీమ్ ప్రకటించింది. అఖిల్ - సూరి బృందం ఏజెంట్ లుక్ ని విడుదల చేయగా అద్భుత స్పందన వచ్చింది. ఈ మూవీ కోసం అఖిల్ ఎంత హార్డ్ వర్క్ చేశాడన్నది అతడి మేకోవర్ చూస్తేనే అర్థమవుతోంది. ఇదంతా అఖిల్ తపన.. కష్టానికి ప్రూఫ్. కానీ అతడు ఆశించిన మాసివ్ హిట్ దక్కుతుందా? అన్నదే ఇప్పుడు ప్రశ్న.
ఏజెంట్ మూవీలో అఖిల్ స్పై పాత్రలో నటిస్తున్నాడు. సైరా లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాన్ని క్లాసిక్ మేకింగ్ స్టైల్ తో నిరూపించుకున్న సురేందర్ రెడ్డి ఈసారి గూఢచర్యం నేపథ్యంలో యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథనే ఎంపిక చేసుకున్నాడు. అఖిల్ కోసం రాజీ పడకుండా బడ్జెట్లు పెట్టే బ్యానర్లు తనకు అండగా నిలిచాయి కాబట్టి అతడు ఏజెంట్ ని అంతే రిచ్ గా తెరకెక్కిస్తున్నాడు. విజువల్ వండర్స్ అనిపించే గొప్ప లొకేషన్లలో అల్ట్రా రిచ్ యాంబియెన్స్ తో ప్రతి ఫ్రేమ్ ని తెరకెక్కిస్తున్నాడు. హాలీవుడ్ పాపులర్ ఫ్రాంఛైజీ బార్న్ సిరీస్ తరహాలో విజువల్స్ తో కట్టి పడేయనున్నాడన్న టాక్ ఇన్ సైడ్ ఉంది. ఇక ఇవన్నీ ఒకెత్తు అనుకుంటే సరైన రిలీజ్ తేదీ మరొక ఎత్తు. ఇంతకీ ఏజెంట్ కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేదెపుడో తెలియాల్సి ఉంది.
ఆగస్టు రేస్ నుంచి వెనక్కి తగ్గి ఇప్పుడు దసరా అనుకుంటున్నాడట. కానీ అప్పుడు నాగార్జున 'ఘోస్ట్' వస్తోంది. చిరంజీవి 'గాడ్ ఫాదర్' కూడా దసరా రిలీజ్ కే మొగ్గు చూపారని సమాచారం ఉంది. అయితే ఘోస్ట్ విడుదలైన రెండు వారాలకు అఖిల్ సినిమాని రిలీజ్ చేయాలా లేకపోతే నాగ్ సెంటిమెంట్ ప్రకారం.. డిసెంబర్ కి వెళ్లాలా? అన్న సందిగ్ధం ఉందిట. డిసెంబర్ లో అవతార్ 2 విడుదలవుతోంది. రణవీర్ సింగ్ సర్కస్ కూడా అదే నెలలో ఉత్తరాదిన భారీగా విడుదలవుతుంది. అందువల్ల డిసెంబర్ లో క్రిస్మస్ సెలవులకు సెంటిమెంట్ గా వచ్చేద్దామనుకున్నా ప్లాన్ సరిగా ఉండాలని విశ్లేషిస్తున్నారు. ఏజెంట్ భారీ బడ్జెట్ చిత్రం కాబట్టి పోటీ లేకుండా సోలోగా రావాలి. పైగా సెలవులు వారాంతాలు కూడా కలిసి రావాలి. దానికి సూరి బృందం ఎలాంటి కసరత్తు చేస్తోందో వేచి చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.