Begin typing your search above and press return to search.
పర్సనల్ గాసిప్స్ పై స్పందించిన అఖిల్
By: Tupaki Desk | 10 Aug 2016 5:40 PM GMTమొన్న జరిగిన ఒక టివి ప్రోగ్రామ్ లో తన పర్సనల్ లైఫ్ గురించి దాదాపు చెప్పేసినంత పని చేశాడు అక్కినేని అఖిల్. ఇప్పటికే మనోడు శ్రీయ భూపాల్ అనే ఓ ఫ్యాషన్ డిజైనర్ తో ప్రేమలో ఉన్నాడని.. మనోడు త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడని అనేక రూమర్లు వచ్చేశాయి. అయితే వీటన్నింటి గురించి ఎప్పుడూ ట్విట్టర్లో అఖిల్ కనీసం ఖండించకపోవడంతో.. అవన్నీ నిజమే అని అందరూ అనుకుంటున్నారు. మరి అఖిల్ ఏమంటాడు?
''అవును. నేను చెప్పాల్సినంత అవసరం లేదు. దాని గురించి ఎక్కువ మాట్లాడను కాని.. నేను ప్రస్తుతం చాలా హ్యాపీ స్పేస్ లో ఉన్నానని చెప్పగలను. ఇప్పుడే మేం తొందరపడట్లేదు. ముందు నా రెండో సినిమాపై ఫోకస్ పెడుతున్నా. ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నా. ఇది చాలా ఇంపార్టెంట్ మూవీ నాకు. అందుకే ప్రస్తుతానికి దీనిమీదనే నా ధ్యాసంతా'' అంటూ చెప్పుకొచ్చాడు అఖిల్. అమ్మాయి పేరు చెప్పకుండా.. తాను ప్రేమలోనే ఉన్నానంటూ ఒప్పుకుని.. కాకపోతే కెరియర్ మీదనే ఫోకస్ పెడతా అన్నాడు. ఇంకేం కావాలి. గుడ్ గోయింగ్ అనే చెప్పాలి.
ఇకపోతే తన రెండో సినిమా మాత్రం ఒక మాంచి ప్రేమ కథ అవ్వాలని.. అలాగే తన వయస్సుకు దగ్గర్లో ఉన్న దర్శకులతో పనిచేయాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. కాకపోతే ఎవరితో చేస్తుందీ ఇంకా కన్ఫామ్ కాలేదని అన్నాడు అఖిల్.